India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

RRRను గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టిన విషయం విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డా. నీలం ప్రభావతి హస్తం ఉందని RRR తరఫున లాయర్ హైకోర్టులో వినిపించారు. రఘురామపై దాడి చేసిన పోలీసులను కాపాడేందుకు, కస్టడీలో RRR ఆరోగ్యం బాగానే ఉందని రికార్డులు తారుమారు చేశారని లాయర్ పోసాని అన్నారు.

పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు నాగార్జున సాగర్‌లో 1670 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

గుంటూరు పాతబస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశామని డీఈవో సీవీ రేణుక తెలిపారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రదర్శనకు తీసుకు రావాలని కోరారు.

APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును NTR వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందన్నారు.

గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు శుక్రవారం పరుగు పోటీలను నిర్వహించారు. పరీక్షలకు 216 మంది మహిళా అభ్యర్థులు వచ్చారు. దేహధారుడ్య, పరుగు పోటీల్లో 106 మంది క్వాలిఫై అయినట్లు అధికారులకు తెలిపారు. పరుగు పోటీల నిర్వహణను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతు పాల్గొన్నారు.

మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. UPHC ఇందిరా నగర్ నుంచి AIIMS మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం PAP స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. AIIMS సిబ్బందిని, అధికారులను అభినందించారు.

చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సుభాని నగర్‌కు చెందిన పాలపర్తి నాగరాజును(50) గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆయనకు ఒక బాబు, పాప ఉన్నారు. డైక్ మెన్ కాలనీకి చెందిన ఆకుల చెన్నయ్య తానే హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య సంఘటన జరిగినట్లు చెబుతున్నారు.

విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి, బాలికా విద్య ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘X’లో ట్వీట్ చేశారు. నేడు ఆమె పోరాటాలను, సేవలను స్మరించుకుంటూ సావిత్రిబాయి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

కర్లపాలెం(M) పేరలి పంచాయతీ సర్పంచ్ మల్లెలవెంకటేశ్వర్లుపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ప్రిన్సిపల్ గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఆదేశాలిచ్చింది. పేరలి సర్పంచి ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర్లు నామినేషన్ ఫారంలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని, ఆయన ఎన్నిక చెల్లదని వీరయ్య అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని, సర్పంచ్ పదవికి అనర్హుడని తీర్పునిచ్చింది.

ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.