Guntur

News April 27, 2024

రామచంద్ర యాదవ్‌పై 28 కేసులు

image

మంగళగిరి అసెంబ్లీకి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇటీవల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. అధికారుల పరిశీలన అనంతరం ఆమోదం లభించింది. ఈయన మంగళగిరితో పాటు పుంగనూరులో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై 28 కేసులున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, మంగళగిరి నియోజకవర్గానికి 76 నామినేషన్లు దాఖలు కాగా, 71 ఆమోదం పొందాయి.

News April 27, 2024

నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

image

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. పాలిసెట్ కోసం జిల్లాలో మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా కేంద్రాలలో 4,628 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

News April 27, 2024

మంత్రి విడదల రజిని నామినేషన్ తప్పులు తడక: కనపర్తి శ్రీనివాస్

image

మంత్రి విడదల రజిని నామినేషన్ పత్రాల్లో లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి రజిని భర్త కుమారస్వామికి అమెరికాలో పౌరసత్వం ఉందన్నారు. మంత్రి నామినేషన్లో వార్షికాదాయం రూ. 3,96,400 ఉందన్నారు. పెదపలకలూరులో రూ.4,55,56,500 విలువ కలిగిన భూమి ఎలా కొన్నారో చెప్పాలన్నారు.

News April 27, 2024

స్వతంత్ర అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణ

image

మంగళగిరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మురుగుడు లావణ్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎదుట ఎన్నికల ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. కాగా లావణ్య నేరుగా కాకుండా తన తరపు వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేశారు. దీనితో శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. మంగళగిరిలో ఐదు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

News April 27, 2024

గుంటూరు: జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో తాడికొండ నియోజకవర్గ పరిధిలో కారులో తీసుకెళ్తున్న సరైన పత్రాలు చూపని రూ.1.50లక్షల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 26వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,44,57,165ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. 

News April 26, 2024

గుంటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

పట్టణంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధి హిందూ కాలేజ్ వెనక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందిన ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు లాలాపేట స్టేషన్‌‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.  

News April 26, 2024

గుంటూరు: టీడీపీలో చేరిన మాజీ మంత్రి డొక్కా  

image

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు స్వయంగా ఆయనకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట పలువురు టీడీపీలోకి చేరారు. డొక్కా ఆశించిన తాడికొండ వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరినట్లు సమాచారం. 

News April 26, 2024

నరసరావుపేట: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

image

పల్నాడు జిల్లాలో ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైనట్లు విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు 1, 239 మంది హాజరుకాగా, 412 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 33.25% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 2,720 మంది విద్యార్థులు హాజరు కాగా, 1, 549 ఉత్తీర్ణత సాధించారన్నారు. 56.95% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

News April 26, 2024

30న తెనాలిలో చంద్రబాబు పర్యటన: నాదెండ్ల

image

ఈనెల 30వ తేదీన తెనాలి పట్టణంలో చంద్రబాబు పర్యటిస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు చంద్రబాడు తెనాలి చేరుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.