India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శావల్యాపురం(M) కారుమంచికి చెందిన నరసింహారావు ఖాతాలోని నగదు మాయంపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. నరసింహరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిర్వహించుకొని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సైబర్ నేరగాడు నరసింహరావుకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు ఖాతాలో పడతాయని, మీకు వచ్చిన లింక్ ఓపెన్ చేయమన్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో డబ్బులు మాయయ్యాయి.

గుంటూరు జిల్లా నంబూరులో శనివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మల్లికది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. స్థానికుల వివరాల మేరకు.. అదే గ్రామానికి చెందిన అక్బర్‌తో మల్లికకు పెళ్లైంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే గొడవలు జరిగాయి. అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని ప్రాథమిక సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై విచారణకు శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్యకమిషన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలుకు వస్తుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు కమిషన్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులకు తెలియజేయవచ్చని అన్నారు.

ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన (శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్(రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.

పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

@అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు @గుంటూరు నుంచి ఎంపీ పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు, వరదల నేపథ్యంలో తీవ్ర పంట నష్టం.

10th విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఇమ్మానియేల్ పేటకు చెందిన అజయ్ కుమార్ చదువు మానేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపు ఇంట్లోనే ప్రసవించిందన్నారు.

సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతామని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం శనివారం డైక్ మన్ హాల్లో సంఘం డైరెక్టర్ జివిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ పాల్గొని మాట్లాడుతూ మనలోని భావాలను మాతృభాష ద్వారా వ్యక్తపరిస్తే అందులో కనిపించే భావోద్వేగం సరైన క్రమంలో చెప్పగలుగుతామన్నారు.
Sorry, no posts matched your criteria.