India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు మంగళగిరి కోర్టు 2వారాలు రిమాండ్ విధించగా గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.
భారీ వర్షాల కారణంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైళ్లు రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 07281 నరసాపూర్ -గుంటూరు రైలును నేటి నుంచి 8వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. 07783 విజయవాడ- గుంటూరు, 07779 గుంటూరు-మాచర్ల, 07580 మాచర్ల-నడికుడి, 07579 నడి కుడి-మాచర్ల రైళ్లు ఇవాళ, రేపు రద్దు చేశామన్నారు.
భారీ వర్షాలతో కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ఈ నెల 15 వరకు పర్యాటకులు కొండవీడు కోటకు రావద్దని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు గురువారం కొండవీడు ఘాట్ రోడ్డు, నగర వనం సందర్శించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాద రహిత స్థాయికి చేరుకున్న తర్వాతే రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో రూ. 80 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయం చెక్కును
గురువారం కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇదే తరహాలో అందరూ చొరవ చూపాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి రూ. కోటి చెక్కును కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ఆయన చెక్కు అందజేశారు.
బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గురువారం కూడా రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం వేకువ జాము నుంచి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పర్యటనకు అవకాశం లేకుండా పోయిందన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా గురువారం కూడా ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వివరించారు.
నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఇసుక రవాణాపై కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లారీ యజమానులు జీపీఎస్ కలిగి ఉండాలన్నారు. ఇసుకను బుక్ చేసుకోవడానికి గనుల శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, తదితరులు పాల్గొన్నారు.
రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, రేపు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
వేమూరు నియోజకవర్గంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బుధవారం వేమూరు మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.