Guntur

News September 4, 2024

బురదలో చెప్పులు లేకుండా పర్యటించిన లోకేశ్

image

ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాల వల్ల బుడమేరుకు భారీ గండ్లు పడిన విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ మరో మంత్రి నిమ్మలతో కలిసి పరిశీలించారు. వరదనీరు పోటెత్తగా విజయవాడతో పాటు, బుడమేరు పరీవాహక ప్రాంతాలు, గ్రామాలు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ గండ్ల వల్ల కొండపల్లి శాంతినగర్-కవులూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాగా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లోని బురదలో చెప్పులు లేకుండా పర్యటించారు.

News September 4, 2024

పల్నాడు: కొండవీడు నగరవనం మూసివేత

image

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు రోడ్డుపై విరిగిపడిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షాలు పడి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న కారణంగా ఈనెల 6 వరకు కొండవీడు నగరవనం మూసివేస్తున్నట్ల జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News September 4, 2024

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు బ్యారేజీ నుంచి 70గేట్ల ద్వారా 6.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. వరద ఉద్ధృతి గంట గంటకూ తగ్గుముఖం పట్టడంతో లంకగ్రామాల ప్రజల ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల్లో నీటమునిగిన లంక గ్రామాలు బయటపడుతున్నాయి.

News September 4, 2024

గుంటూరు: ఏపీ అలర్ట్‌తో 7.49 కోట్ల మందికి హెచ్చరిక

image

రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49 కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 149 పశువులు 59,848 కోళ్లు మరణించాయన్నారు. 12 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని, అధిక వర్షాల కారణంగా 2851 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.

News September 3, 2024

గుంటూరు నుంచి 50 వేల మందికి ఆహారం సరఫరా: కలెక్టర్

image

విజయవాడలో వరదలు ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో 50వేల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలు సరఫరాకు ఆహార, పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఆహారం సిద్ధం చేసి బస్సుల ద్వారా విజయవాడకు పంపించడం జరుగుతుందన్నారు. దాతలు ముందుకు వచ్చిన భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు.

News September 3, 2024

నరసరావుపేట: నర్సింగ్ విద్యార్థులకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

image

నర్సింగ్ చదువుతున్న వారికి జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జపాన్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ANM / GNM/ BSC నర్సింగ్ పూర్తి చేయాలని తెలిపారు. అభ్యర్థులు https://shorturl.at/FB7oK లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వివరాల కోసం ఏపిి‌ఎస్‌ఎస్డి‌సి హెల్ లైన్ నంబర్ 99888 53335 సంప్రదించాలని వివరించారు.

News September 3, 2024

గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వాయిదా

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజా తెలిపారు. ఈ వేడుకలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తెలియజేస్తామని, ఉపాధ్యాయులు గమనించాలని డీఈవో చెప్పారు.

News September 3, 2024

గుంటూరు: పరీక్షలు వాయిదా

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీటెక్ మొదటి, రెండో సంవత్సర సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10కి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శివప్రసాదరావు చెప్పారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు వర్షాల వల్ల రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో వాయిదా వేశామని సీఈ వెల్లడించారు.

News September 3, 2024

రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం వాయిదా !

image

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం CK Convention మంగళగిరిలో చేయుటకు ఏర్పాట్లు చేశారు. కానీ సీఎం చంద్రబాబుతో పాటూ, ఇతర అధికారులు వరద సహాయక చర్యల్లో బిజీగా ఉండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు.

News September 3, 2024

గుంటూరు: ‘2 రోజులు సెలవు ఇవ్వాలి’

image

కృష్ణానదిలో భారీ నీటి ప్రవాహం వల్ల ఏపీ హైకోర్టు, ఏపీ సచివాలయానికి వెళ్లే కరకట్ట రోడ్డు దెబ్బతింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే భారీ వరదల కారణంగా ఏపీ హైకోర్టుకు వెళ్లే ఇతర రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ సమస్యలు పరిష్కరించేందుకు AP హైకోర్టుకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అభ్యర్థించారు.