India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లవ్ మ్యారేజీకి పెద్దలు అంగీకరించలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కావ్య(24), సత్తెనపల్లి మం, ఎర్రగుంట్లపాడుకు చెందిన గోపి ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. ఇద్దరు అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కావ్య ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ఉత్సవ నిర్వాహాకులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగల్ విండో పద్దతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పండుగ ఉత్సవాలపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంత, భక్తి పూర్వక వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉద్ధృతికి వచ్చిన పడవలు గేట్లకు ఢీ కొట్టిన ప్రాంతాన్ని కూడా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జక్కంపూడి, సింగ్ నగర్‌లో పర్యటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగాలు ప్రబలకుండా చూడాలన్నారు. హెల్త్ క్యాంపుల్లో పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు . అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
రేపు గుంటూరు డి.ఎల్.టి.సి, ఐ.టి.ఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృధి అధికారి ప్రణయ్ సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బి.టెక్ ఆపైన చదువుకున్న వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు.
వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలకూ కష్టాలు తప్పడం లేదు. ఈక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజుపాలెం మండలం అనుపాలేనికి చెందిన పగిల్ల గోపి కౌలుకు తీసుకుని మూడెకరాల్లో పైరు సాగు చేశారు. వరద నీటిలో పంట మునిగిపోయింది. దీనికి తోడు పాత అప్పులు ఉండటంతో బాధ తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి గుంటూరు కలెక్టరేట్, నగరపాలకసంస్థ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0863-2234014, 9849904013కి, అదేవిధంగా నగర ప్రజలు కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన 0863-2345105, 9849908391 నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తుంది. Share It
రాష్ట్రంలో వరద పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శనివారం గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 6గంటల వరకు రాష్ట్రంలో అత్యధికంగా మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు స్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు 9701379072, నరసరావుపేట 9701379978, నడికుడి 7989875492, నల్గొండ 9030330121, మిర్యాలగూడ 8501978404, నంద్యాల 7702772080, దొనకొండ 7093745898 తదితర నంబర్లకు ఫోన్ చేసి రైళ్ల రాకపోకల సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.