Guntur

News April 21, 2024

మంగళగిరి: తండ్రి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న తనయుడు

image

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన బీ ఫామ్ల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్న నారా లోకేశ్ టీడీపీ అధినేత, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తండ్రి చంద్రబాబు కాళ్ళు మొక్కి నారా లోకేశ్ ఆశీర్వాదం తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News April 21, 2024

టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్ అందించిన చంద్రబాబు

image

గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఆదివారం బీ-ఫామ్‌లను అందచేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్, గుంటూరు తూర్పు-మొహమ్మద్ నజీర్, గుంటూరు పశ్చిమ-గళ్లా మాధవి, ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్లు బీ ఫామ్‌లను అందుకున్నారు.

News April 21, 2024

గుంటూరు TDP పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవిపై ఫిర్యాదు

image

టీడీపీ ప్రచారంలో బాలుడిని వినియోగించిన ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 18వ తేదీ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్లా మాధవి ఆధ్వర్యంలో అమరావతి రోడ్డు వేళంగిని నగర్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరు సంవత్సరాల బాలుడిని ప్రచారంలో ఉపయోగించారని, దీనిపై ఎంసీసీ టీమ్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరాణి ఫిర్యాదు చేయడంతో టీడీపీ గళ్లా మాధవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: మాచర్ల
➤ అభ్యర్థి: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(YCP)
➤ భార్య: రమాదేవి
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.2.87 కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.4.36కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 100 గ్రాములు, భార్యకు 300 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: నరసరావుపేట
➤ అభ్యర్థి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (YCP)
➤ భార్య: సుస్మిత రెడ్డి
➤ విద్యార్హతలు: MS(Ortho)
➤ చరాస్తి విలువ: రూ.1.14 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.1.44కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: రూ.3.24కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.15 లక్షలు
➤ బంగారం: రూ.19లక్షలు విలువైన, భార్యకు రూ.58లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

కిలారి వెంకట రోశయ్య ఆస్తుల వివరాలు

image

➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: కిలారి వెంకట రోశయ్య (YCP)
➤ భార్య: లక్ష్మీ సరస్వతి
➤ విద్యార్హతలు: BA
➤ చరాస్తి విలువ: రూ.5.87 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.5.01కోట్లు
➤ కేసులు: 4
➤ అప్పులు: రూ.3.17కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1.07 లక్షలు
➤ బంగారం: 623 గ్రాములు, భార్యకు 1000 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 21, 2024

నరసరావుపేట: పోటీ చేసే అభ్యర్థులు వివరాలు పొందుపరచాలి

image

సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థుల రాజకీయ పార్టీల ఖర్చులు వివరాలను సంబంధిత రిజిస్టర్లలో ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు గౌతమన్ , జోసఫ్ జార్జ్ తెలపారు. శనివారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో, అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అధికారులతో ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్‌పై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 

News April 20, 2024

గుంటూరు: సాగర్ కుడి కాలువలో ముగ్గురు పిల్లలు గల్లంతు

image

దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో సాగర్ కుడి కాలువలో శనివారం ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా సాగర్ కాలువ వద్ద ముగ్గురు పిల్లలు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో కాలువలో ముగ్గురు పడి కొట్టుకుపోయారు. ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 20, 2024

గుంటూరు: విధుల్లో పాల్గొనే విలేకర్లకు పోస్టల్ బ్యాలెట్ 

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విధుల్లో పాల్గొనే విలేకర్లకు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్షన్ అథారిటీ లేఖలు పొందిన విలేకర్లు మాత్రమే, కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్లో ఫార్మ్-12డి పొంది పూర్తిచేసి, వాటితో పాటు ఓటర్ ఐడి, అక్రిడిటేషన్ నకలు జతచేసి ఈ నెల 21సాయంత్రం 6గంటలలోగా అందజేయాలన్నారు.

News April 20, 2024

గుంటూరు: విడదల రజిని ఆస్తుల వివరాలు ఇవే 

image

➤ నియోజకవర్గం: గుంటూరు వెస్ట్
➤ అభ్యర్థి: విడదల రజిని(YCP)
➤ భర్త: కుమారస్వామి
➤ విద్యార్హతలు: B.SC
➤ చరాస్తి విలువ: రూ.1.25కోట్లు
➤ భర్త చరాస్తి విలువ: రూ.53.03కోట్లు
➤ కేసులు: లేవు
➤ అప్పులు: లేవు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.5 లక్షలు
➤ బంగారం: 600గ్రాములు, భర్తకు 300గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.