Guntur

News April 20, 2024

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వడ దెబ్బ

image

మంగళగిరి ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గణపతి నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చికిత్స నిమిత్తం వెళ్లారు. ఎమ్మెల్యేకు వడదెబ్బ తగిలినట్టు వైద్యాధికారిణి పి. అనూష తెలిపారు. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కించినట్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 20, 2024

వేగేశన నరేంద్ర వర్మ ఆస్తుల వివరాలు

image

➤ నియోజకవర్గం: బాపట్ల
➤ అభ్యర్థి: వేగేశన నరేంద్ర వర్మ రాజు(TDP)
 ➤ భార్య: హరికుమారి
 ➤ విద్యార్హతలు: 10వ తరగతి
 ➤ చరాస్తి విలువ: రూ.73.72 కోట్లు
 ➤ స్థిరాస్తి విలువ:రూ.22.59 కోట్లు
 ➤ కేసులు: 2
 ➤ అప్పులు: రూ.25.91 కోట్లు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.10.67 లక్షలు
 ➤ బంగారం: తన వద్ద రూ.27లక్షలు, భార్య వద్ద రూ.47లక్షల విలువైన బంగారం ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 20, 2024

నందిగం సురేశ్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ పార్లమెంట్: బాపట్ల
➤ అభ్యర్థి: నందిగం సురేశ్ (YCP)
 ➤ భార్య: బేబీలత
 ➤ విద్యార్హతలు: 9వ తరగతి
 ➤ చరాస్తి విలువ: రూ.68.48 లక్షలు
 ➤ స్థిరాస్తి విలువ: రూ.2 లక్షలు
 ➤ కేసులు: 4
 ➤ అప్పులు: రూ.77.05 లక్షలు
 ➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.6 లక్షలు
 ➤ బంగారం: 150 గ్రాములు, భార్యకు 450 గ్రాములు
 NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 20, 2024

తెనాలి శ్రావణ్ కుమార్ ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: తాడికొండ
➤ అభ్యర్థి: తెనాలి శ్రావణ్ కుమార్ (TDP)
➤ విద్యార్హతలు: MSC, MA, LLB
➤ మొత్తం చరాస్తి విలువ: రూ.1,47 కోట్లు
➤ స్థిరాస్తి విలువ: రూ.3.89 కోట్లు
➤అప్పులు: రూ.22.75 లక్షలు
➤ కేసులు: 08 కేసులు (పెండింగ్‌లో ఉన్నాయి.)
➤ భార్యపేరు: పద్మావతి
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

జీవీ ఆంజనేయులు ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: వినుకొండ
➤ అభ్యర్థి: జీవీ ఆంజనేయులు (TDP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.50,99 లక్షలు
➤ స్థిరాస్తి విలువ: రూ.119.07 కోట్లు
➤అప్పులు: రూ.29.98 కోట్లు
➤ కేసులు: 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
➤ బంగారం: 5,909 గ్రాములు ఉంది.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

నూరి ఫాతిమా ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: గుంటూరు ఈస్ట్
➤ అభ్యర్థి: నూరి ఫాతిమా (YCP)
➤ భర్త పేరు: అబ్దుల్ హుస్సేన్
➤ విద్యార్హతలు: బీటెక్
➤ చరాస్తి విలువ: రూ.22,29,708.31 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.20.11,417.83 (షేర్లు, డిపాజిట్లు)
➤ బంగారం: 300 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

మురుగుడు లావణ్య ఆస్తుల వివరాలు ఇవే

image

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: మురుగుడు లావణ్య (YCP)
➤ విద్యార్హతలు: BSC
➤ చరాస్తి విలువ: రూ.42.54 లక్షలు
➤ భర్త చరాస్తి విలువ: రూ.85.01 లక్షలు
➤ బంగారం: 450 గ్రాములు, భర్త పేరుతో 100 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి

News April 20, 2024

గుంటూరులో నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే

image

గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం పలువురు నామినేషన్ దాఖలు చేశారు. షేక్ నూరి ఫాతిమా(YCP), గూడవల్లి మణికుమారి (బహుజన్ సమాజ్ పార్టీ), షేక్ రజాక్ (నవతరం పార్టీ), షేక్ దుర్రే షహవర్ (స్వతంత్ర), కాజా రాఘవేంద్ర సంజీవరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా). గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి రోశయ్య (వైసీపీ), షేక్ అస్లాం అక్తర్(స్వతంత్ర), అక్కిశెట్టి శ్రీకృష్ణ (స్వంతత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

News April 20, 2024

పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగంచేసుకోవాలి: శివశంకర్ 

image

ఏ ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు మిస్ అవ్వకుండా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో అత్యవసర శాఖల పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులలో ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెల 5,6,7 తేదీలలో పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 

News April 19, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

image

గుంటూరులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజ్జనగుండ్ల సెంటర్ నుంచి పలకలూరు వెళ్లే రోడ్డులో శుక్రవారం రాత్రి ఒక కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. అనంతరం ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.