Guntur

News April 14, 2024

తెనాలిలో గంజాయి విస్తరించింది: నాదెండ్ల

image

తెనాలిలో చిన్న చిన్న అంగళ్లలోనూ గంజాయి ఎక్కువగా విస్తరించిందని తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తెనాలిలో అనేక హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.

News April 14, 2024

ఎన్నికలకు ఖర్చులను ఏర్పాటు చేయాలి: శివ శంకర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాకి నియమించిన ఎన్నికల పరిశీలకులకు అవసరమైన వసతి, రవాణా ఇతర సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివ శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు తదితరులతో వెబెక్స్ ద్వారా మీటింగ్ నిర్వహించారు.

News April 14, 2024

గుంటూరు: మరికొద్ది గంటలే గడువు

image

జిల్లాలో అర్హత కలిగిన యువతి, యువకులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ కోరారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఏప్రిల్14 ఆదివారం రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. భారత ఎన్నికల సంఘం నూతన ఓటర్లుకు అవకాశం కల్పించిందని అన్నారు. 2024 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు పొందేందుకు బీఎల్‌ఓలకు గాని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News April 14, 2024

బాపట్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం

image

అగ్ని ప్రమాదం జరిగి గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామం నుంచి గడ్డిని తరలిస్తుండగా కసుకర్రు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్లు మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ వల్లూరు గ్రామానికి చెందిన శివారెడ్డిదిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

News April 14, 2024

నరసరావుపేట: డివైడర్‌ను ఢీకొని ఇసుక లారీ బోల్తా

image

నరసరావుపేట పట్టణంలోని ఉప్పలపాడు బైపాస్ రోడ్డు వద్ద ఇసుక లారీ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆదివారం నరసరావుపేట నుంచి ఉప్పలపాడు వెళుతున్న ఇసుక లారీ డివైడర్ ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆ సమయంలో అటుగా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

News April 14, 2024

నేడు తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తాజాగా ఖరారైనట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పవన్ తెనాలి రానున్నారు. ఆయన తెనాలి రావడం ఇదే తొలిసారి కావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా తెనాలి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News April 14, 2024

బాపట్ల జై భీమ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోటయ్య

image

అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్యను జై భీమ్ రావు భారత్ పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. బాపట్ల పార్లమెంటులో అత్యధిక ఓట్లతో పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోటయ్యకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల గొంతుకగా ఓటర్ల ఓట్లను అభ్యర్థిస్తానని కోటయ్య తెలిపారు.

News April 14, 2024

రేపల్లెలో సైకిల్ యాత్ర ప్రారంభించిన చంద్రబాబు

image

రేపల్లె తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్స్ వింగ్ టీం ఫీల్డ్ వర్క్‌లో భాగంగా.. ఈనెల 13వ తేదీ నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో చేపట్టిన భారీ సైకిల్ యాత్రను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ యాత్రలో భాగంగా టీడీపీ అమలు చేయబోయే హామీలను ప్రజలకు తెలియజెప్పటమే యాత్ర ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

News April 13, 2024

GNT: వైసీపీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు

image

గుంటూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉస్మాన్ కాంగ్రెస్‌ను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చందు సాంబశివరావు బీజేపీని వీడారు. వీరు సీఎం జగన్ సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఉస్మాన్‌, సాంబశివరావులను వైసీపీలోకి ఆహ్వానించారు.

News April 13, 2024

పల్నాడు: పంటకాల్వ తవ్వుతూ ఉపాధి కూలి మృతి

image

పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో పంటకాల్వ తవ్వుతూ పనిచేసే ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. లింగంగుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఎనుబర్ల బాబు(50) లింగంగుంట్ల-పెదకూరపాడు మార్గంలో కందకం తవ్వకం పనులకు వెళ్లి రెండు గజాలు మట్టి తవ్వి ఎండవేడికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు పెదకూరపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.