India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విపత్తుల సమయంలో ప్రజలతో పాటు పశువులను రక్షిత ప్రాంతాల్లోకి తరలించేలా ముందస్తుగా ఆశ్రయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుజిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. బుధవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాగా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలు పశువులను వదిలి పునరావాస కేంద్రాలకు రావటానికి ఆసక్తి చూపటం లేదని కలెక్టర్ తెలిపారు.

11వ శతాబ్దంలో మహాభారతాన్ని తలపించిన పల్నాటి యుద్ధం ఓ మహావీరుని విజయానికి ప్రతీక అని చరిత్ర చెబుతుంది. అతడే మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు.. అతి వీర భయంకరుడు ‘మాల కన్నమదాసు’. బ్రహ్మనాయుడి దత్తపుత్రునిగా రాజాజ్ఞను పాటిస్తూ సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న సహకారంతో నాగమ్మను ఓడించి మాచర్లకు విజయాన్ని చేకూర్చాడని చరిత్రలో లిఖించబడింది. యుద్ధంలో కన్నమదాసు వాడిన భైరవ ఖడ్గం నేటికీ పూజలందుకోవడం విశేషం.

గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు, పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లాలో పలుచోట్ల నాలుగు సెకన్ల పాటు రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీ ప్రాంతంలో ఎక్కడైనా కంపించిందా కామెంట్ చేయండి.

అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

పల్నాడు సత్యాగ్రహం దేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన జిల్లాలో జరిగిన ఉద్యమం.1921లో కరువు వచ్చింది. ప్రజలు తాము అటవీ ఉత్పత్తులను ఉచితంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించక పశువుల్ని బంధించటంతో ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.1921 సెప్టెంబర్ 23న జరిగిన కాల్పుల్లో పల్నాటి ప్రజానాయకుడు <<14782225>>కన్నెగంటి <<>>హనుమంతు, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఉద్యమం ఆగిపోయింది

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ మహిళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. బాలాజీ నగర్‌లో ఉంటున్న మహిళకు గతంలో వివాహమైంది. ప్రస్తుతం ఓ దుకాణంలో సేల్స్ విభాగంలో పని చేస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తి పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రూ.17 లక్షలు ఆమె నుంచి తీసుకుని మొహం చాటేశాడు.

వెంగళాయపాలెంకు చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు తన నగ్న వీడియోలతో బెదిరించి అఘాయిత్యం చేయడమే కాకుండా నెలకు రూ.4వేలు తీసుకున్నాడని బాధితురాలు గుంటూరు SPకి ఫిర్యాదు చేసింది. తన తినుబండారాల దుకాణంలో చోరీ చేసిన వ్యక్తిని తనకున్న పలుకుబడితో పట్టిస్తానని పరిచయం పెంచుకున్నాడని చెప్పింది. వ్యాపారాలు లేక డబ్బు ఇవ్వకపోవడంతో తనపై దాడి చేశాడని, దీంతో జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పి ఫిర్యాదు చేశానన్నారు.

చేబ్రోలులోని హత్య కేసును పోలీసులు ఛేదించారు. SP వివరాలు.. ఇబ్రహీంపట్నం(M) కొండపల్లికి చెందిన నాగరాజు కొత్తరెడ్డిపాలెంలో అద్దెకు ఉంటూ ఓ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ, మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఆమె మరొకరితో సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై ఆమె కూతురిని అడిగాడు. బాలిక చెప్పకపోవడంతో తండ్రిలాగా చూసుకుంటున్న తనకు చెప్పలేదని నాగరాజు జులై 15న హత్య చేసి, పరారయ్యాడు. నిన్న లొంగిపోయాడు.

ఈనెల 7వ తేదీన గుంటూరులో ఫ్లాగ్‌డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ చెప్పారు. ఈ సందర్భంగా సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా రూపొందించిన స్టిక్కర్లను సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ విరాళాలు దేశ భద్రత కోసం అసువులు బాసిన వీర జవానుల కుటుంబ సభ్యులకు ఎంతో కొంత తోడ్పాటు అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సిఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.