Guntur

News August 19, 2024

ప్రతి రూపాయి బాధ్యతతో ఖర్చు పెట్టాలి: పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు చేయాలన్నారు.

News August 19, 2024

ఫొటోగ్రఫీ డే.. కెమెరామేన్‌ అవతారమెత్తిన సీఎం

image

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. అనంతరం చంద్రబాబు వారి చేతిలో కెమెరా తీసుకుని ఫొటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఉంటూ వివిధ కార్యక్రమాల ఫొటోలను తీయడం చాలా కష్టతరమని సీఎం వ్యాఖ్యానించారు.

News August 19, 2024

గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక

image

అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14, 16 బాలబాలికలు, అండర్-18, 20 యువతీ, యువకుల జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు ఏఎన్ యూలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

News August 19, 2024

పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

పిడుగురాళ్లలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మారురి నాగతేజారెడ్డి(25), ఇందూ (30), అమూల్య (15)లు గురజాలలో వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

News August 19, 2024

నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి: పెమ్మసాని

image

గుంటూరు నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసానిని కమిషనర్ పులి శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా రోడ్ల ప్యాచ్ వర్క్‌లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్పొరేషన్‌‌పై పడుతున్న రెవెన్యూ భారాన్ని తగ్గించి, జీఎంసీకి రావాల్సిన ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని కమిషనర్‌కు సూచించారు.

News August 18, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* గుంటూరు: ప్రేమ పేరుతో మోసం చేసిన బాలుడు
* గుంటూరు: 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు
* అమరావతికి రూ.15వేల కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకు ఓకే!
* గుంటూరు శాస్త్రవేత్తకు నాసా అవార్డు
* గుంటూరులో 198 బైకులు సీజ్
* పల్నాడులో సినిమా షూటింగ్ సందడి
* ‘మంగళగిరి స్టేడియం సంవత్సరంలో పూర్తి చేస్తాం’

News August 18, 2024

‘నేరాల కట్టడికి ముందస్తు సమాచారం కీలకం’

image

నేరాల కట్టడికి ముందస్తు సమాచారం సేకరించడం కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆదివారం ఆయన బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖకు ఎస్‌బీ విభాగం కళ్ల, చెవులు వంటిదన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌ఛార్జ్ సీఐ బాల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News August 18, 2024

గుంటూరులో 198 బైకులు సీజ్

image

గుంటూరు పట్టణంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలలో సరైన పత్రాలు లేని 198 బైకులను సీజ్ చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 198 వాహనాలకు ఆర్టీఐ అధికారులు చలానాలు విధించినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని నల్లపాడు సీఐ అన్నారు. ప్రతి వారం కార్యక్రమం చేపడతామన్నారు.

News August 18, 2024

గుంటూరు శాస్త్రవేత్తకు నాసా అవార్డు

image

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త శింగం శ్రీకాంత పాణికి దక్కింది. పరిశోధనల్లో ఆయన చూపిన సృజనాత్మకతకు నాసా ఈ అవార్డు అందించింది. ఈ మేరకు అమెరికాలోని ఆలబాలోని హంట్స్ విల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

News August 18, 2024

బాపట్ల: ప్రేమ పేరుతో మోసం చేసిన బాలుడు

image

మైనర్ల ప్రేమ విషయమై ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి కథనం మేరకు.. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడు 6వ తరగతి వరకు చదివి అలంకరణ పనులు చేస్తున్నాడు. ప్రేమ పేరుతో గత 8 నెలలుగా వీళ్లు చనువుగా ఉంటున్నారు. గమనించిన బాలిక తల్లి బాలుడు మోసం చేశాడని బాపట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అహమ్మద్ జానీ తెలిపారు.