Guntur

News April 10, 2024

గుంటూరు: భార్య గొంతు కోసి పరారైన భర్త

image

పెదకాకానిలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వెంగళరావు నగర్‌లో నివాసముంటున్న సయ్యద్‌ షామీర్‌ మూడేళ్ళ క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సయ్యద్‌ తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 10, 2024

టీడీపీలో చేరిన మంత్రి అంబటి బంధువు

image

బాపట్లకు చెందిన వివేకా సర్వీస్ సొసైటీ కార్యదర్శి, మంత్రి అంబటి రాంబాబు బంధువు అంబటి మురళీకృష్ణ టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మురళీకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి మురళీకృష్ణ 1989 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2010 ఓదార్పు యాత్రలో వెదుళ్లపల్లిలోని తన కార్యాలయంలో వైఎస్ జగన్‌కు బస ఏర్పాటు చేశారు.

News April 10, 2024

బుడంపాడు సమీపంలో రహదారిపై మృతదేహం

image

గుంటూరు జిల్లా బుడంపాడు సమీపంలో రహదారిపై బుధవారం వృద్ధుడి మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. నారాకోడూరు నుంచి బుడంపాడు మార్గంలో రహదారిపై ఓ వృద్ధుడు పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులకు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2024

నరసరావుపేట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్

image

కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ స్థానానికి జి.అలెగ్జాండర్‌ను పార్టీ ఖరారు చేసింది. ఆయన నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 1993 నుంచి అలెగ్జాండర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈయన పూర్తి పేరు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. మండలంలోని గురవాయపాలెంలో పుట్టి, నరసరావుపేటలో స్థిరపడ్డారు.

News April 10, 2024

12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ

image

ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్‌కు చేరుకుంటుదన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.

News April 10, 2024

పల్నాడు: నేటి జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

పల్నాడు జిల్లాలో సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర నేటి ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం నుంచి ప్రారంభమవుతుంది. రొంపిచర్ల, విప్పర్ల, నకరికల్లు, దేవరంపాడు క్రాస్ రోడ్డు కొండమోడు మీదగా పిడుగురాళ్లకు చేరుకుంటుంది. పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ వద్ద సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం కొండమోడు జంక్షన్ మీదుగా రాజుపాలెం, అనుపాలెం, రెడ్డిగూడెం మీదగా దూళిపాళ్ళ చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారు.

News April 9, 2024

కాకుమాను: వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ తొలగింపు

image

కాకుమాను గ్రామ సచివాలయం-2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వాంగ రత్న కిషోర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, వైసీపీ సంబంధించిన ర్యాలీలో మంగళవారం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ను తొలగించామని కాకుమాను పంచాయతీ కార్యదర్శి నివేదిక సమర్పించారు. వాలంటీర్‌ను విధుల నుంచి ఎంపీడీఓ తొలగించారు.

News April 9, 2024

REWIND: ధూళిపాళ్లకు డబుల్ హ్యాట్రిక్ మిస్

image

పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్రకు మంచి రికార్డ్ ఉంది. ఆయన వరుసగా 1994, 99, 2004, 2009, 2014లో TDP ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓడిపోయారు. కేవలం 1112 ఓట్లతో డబుల్ హ్యాట్రిక్ విజయం ముంగిట బోల్తా కొట్టారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీతో ధూళిపాళ్ల తలపడనున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి మీ కామెంట్.

News April 9, 2024

REWIND: వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా మాకినేని పెదరత్తయ్య

image

ప్రత్తిపాడు నుంచి మాకినేని పెదరత్తయ్య వరుసగా 5సార్లు MLA అయ్యారు. 1983, 85, 89, 1994, 1999లో ఆయన TDP నుంచి విజయం సాధించారు. ఈయన మొత్తం 6సార్లు పోటీ చేయగా, 2004లో రావి వెంకటరమణ చేతిలోనే ఓడిపోయారు. ఈయన బరిలో నిలిచిన అన్నిసార్లు కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను బరిలో దించింది. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి బలసాని కిరణ్ కుమార్, కూటమి నుంచి బి.రామాంజనేయులు బరిలో ఉన్నారు.

News April 9, 2024

పల్నాడు: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.?

image

సీఎం జగన్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నారు. నేడు శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో వేడుకల్లో పాల్గొననున్న ఆయన, మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉగాది రోజు మేనిఫెస్టో ప్రకటన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.