Guntur

News April 7, 2024

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ మృతి

image

చిలకలూరిపేట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ బొగ్గల వరపు వీరయ్య ఆదివారం కన్ను మూశారు. ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వీరయ్య గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర నంతరం ఆరోగ్యం మెరుగుపడినా శనివారం సాయంత్రం మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

News April 7, 2024

రొంపిచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

మండలంలోని అన్నవరప్పాడు బ్రిడ్జి వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు అన్నవరప్పాడు వెళ్తుండగా బ్రిడ్జి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలశౌరి అక్కడికక్కడే మృతి చెందిగా, వెంకటేశ్వర్లు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

News April 7, 2024

వినుకొండ వద్ద రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 7, 2024

విడుదల రజనీ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు

image

గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని ముస్లిం సేనా రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుభాని తెలిపారు. ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా మసీదులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎన్నికల అధికారి రాజ్యలక్ష్మిని షేక్ సుభాని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. రజినీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 7, 2024

ANU: పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్‌ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News April 7, 2024

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా, కేంద్ర సాయిధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

News April 6, 2024

మాచర్ల: చేపల వేటకు వెళ్లి.. మత్యకారుడి మృతి

image

మండలంలోని అనుపులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన బొందు తాతారావు(50) అనుపు వద్ద కృష్ణా నదిలో చేపలను పడుతుండగా.. ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నదిలో కొట్టుకుపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు గాలించగా తాతారావు అనుపు వద్ద కృష్ణా జలాశయంలో శవమై తేలియాడుతూ కనిపించాడు.

News April 6, 2024

కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల

image

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ను ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

News April 6, 2024

గుంటూరు: కంటైనర్ ఢీ.. ఆటో డ్రైవర్ మృతి

image

గుంటూరు నగర శివారు జాతీయ రహదారి అంకిరెడ్డిపాలెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చేరెడ్డి జగన్మోహనరావు (61) మృతి చెందాడు. జాతీయ రహదారి పక్కన పూల బస్తాలను తరలించే క్రమంలో ఇతను ఆటోదిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి అతణ్ని ఢీకొంది. ఈ ఘటనలో జగన్మోహనరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఏడుకొండలు కేసు నమోదు చేశారు.

News April 6, 2024

సీఎం అయ్యాక తొలిసారి పిడుగురాళ్లకు జగన్

image

జగన్ సీఎం అయ్యాక ఈనెల 8న తొలిసారి గురజాల నియోజకవర్గానికి వస్తుండటంతో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేమంతా సిద్ధం సభకు పిడుగురాళ్ల సమీపంలో హైవే వద్ద సభా స్థలాన్ని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. 2019 ఎన్నికల తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సమాయాత్తం అవుతున్నాయి.