India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ANU కొత్త వైస్ ఛాన్సలర్‌గా సత్యనారాయణ రాజు నియామకమైన విషయం తెలిసిందే. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన పరిశోధనలు చేస్తూ పలు అవార్డులను అందుకున్నారు. 2017లో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అవార్డును, మహిమ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును, ఉత్తమ AN అవార్డును, 2018లో డాక్టర్ ఆనంద్ ప్రకాష్ అవార్డును, ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు.

గుంటూరు జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు SP వకుల్ జిందాల్ ప్రత్యేక టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. గంజాయి, పేకాటలపై ప్రత్యేక నిఘా కోసం గతంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి వర్గాల్లో అత్యధిక కాలం పని చేసి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో అనుభవం ఉన్న సిబ్బందితో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించారు

ఒకప్పుడు అట్లతద్ది పర్వదినం ఉయ్యాలలు కట్టుకొని ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేసేవారు. అట్లతద్ది రోజున మహిళలు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఉపవాసం మొదలుపెట్టి, సాయంత్రం చంద్రోదయం తర్వాత అట్లు తిని ఉపవాసం విరమిస్తారు. మహిళలు ఒకచోట చేరి, పెద్ద చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఆడుకుంటూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడటం ఒక ఆనవాయితీ. అయితే రాను రాను ఈ ఆనవాయితీలు కనుమరుగవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో ఆయన ఉండవల్లిలో బుధవారం సమావేశమయ్యారు. టీచర్ల బదిలీలు, భాషా పండితుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో సైతం పలు కథనాలు పరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు వేగవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో
బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా శిక్షణా కేంద్రం (DTC), ఈగిల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NDPS చట్టంలోని సీజ్, శాంప్లింగ్, డిస్పోజల్ వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి సీసీఎస్ డీఎస్పీ మధుసూదన్ రావు అవగాహన కల్పించారు. DTC సీఐ ఈగల్ సీఐ ఉన్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సమంతపుడి వెంకట సత్యనారాయణ రాజును నియమించారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కీటకాలజీ విభాగ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బుధవారం సమంతపూడి వెంకట సత్యనారాయణ రాజును కొత్త వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని కొందరు ఫోర్జరీ చేసి నకిలీ ఫామిలీ మెంబర్ సర్టిఫికెట్ తయారు చేశారు. MRO గోపాలకృష్ణ కథనం మేరకు.. వినుకొండ SBI మేనేజర్ ఓ ప్రాపర్టీ కొనుగోలు నిమిత్తం అమ్మేవారి తాలూకా ఫ్యామిలీ సర్టిఫికెట్ తెనాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించారు. ప్రాథమిక విచారణలో సర్టిఫికెట్ నకిలీ అని తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచాణ చేసి చర్యలు తీసుకోవాలని MRO పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి బీ.ఫార్మసీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్), ప్రథమ సెమిస్టర్ (సప్లమెంటరీ) పరీక్షలతో పాటు ఫార్మా.డి. పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. బి.ఫార్మసీ పరీక్షలు18 పరీక్షా కేంద్రాల్లోను, ఫార్మా.డీ.పరీక్షలు 10 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు పరీక్షలను పరిశీలించారు.

ఆశా వర్కర్స్‌కు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. ఆరేళ్లుగా జీతాలు పెరగలేదని, 5G ఫోన్‌లు ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ. 20 వేలు మట్టి ఖర్చుల కోసం ఇవ్వాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.