India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు పలు కేసులపై రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. బోరుగడ్డ అనిల్ కేసులో అరండల్ పేట పోలీసులు సాక్ష్యాలు కోర్టు ముందు హాజరు పరిచారు. పోలీసు వారు ఇచ్చిన సాక్ష్యాల మేరకు కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. బెయిల్ పొందడానికి బోరుగడ్డ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయని గుంటూరు పోలీసులు తెలిపారు.

ఎవరైనా సాధారణ (లేదా) ఆన్‌లైన్ యాప్స్(Whatsapp, Telegram, Skype) ద్వారా కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటే భయపడవద్దని ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. డిజిటల్ అరెస్టు పట్ల అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్ యాప్స్ ద్వారా నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈపూరు మండలంలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆరేపల్లి ముప్పాళ్ళ వద్ద సాగర్ కెనాల్ పెద్ద కాలువలో దూకాడు. ఇద్దరు పిల్లలు నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కౌలు రైతులకు రుణాలు అందకపోవడం అనేది సామాజిక సమస్య అని గుంటూరు, కృష్ణా పట్టభధ్రుల MLC లక్ష్మణరావు శాసనమండలిలో అన్నారు. APలో 26 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. భూయజమాని సంతకం ఉంటేనే రుణ అర్హత కార్డులు ఇస్తామనే నిబంధనతో చాలామంది నష్టపోతున్నారని చెప్పారు. భూమి మీద యజమానికి, పంట మీద కౌలు రైతుకి రుణాలు ఇవ్వడం మంచిదని సూచించారు. కులాన్ని బట్టి కాకుండా రైతులందరికీ రుణ అర్హత కార్డులివ్వాలన్నారు.

నరసరావుపేట మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. భూ వివాదంలో డబ్బులివ్వకపోతే తనను చంపుతానని బెరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన గోపిరెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదని, తనపై కేసు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదన్నారు. ఎటువంటి సంబంధం లేని అంశంలో చంపుతామని బెదిరించాడని కేసు పెట్టడం దారుణమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు.

✬ GNT: శాసన మండలిలో మంత్రి లోకేశ్ ఆగ్రహం
✬ బాపట్లలో బైక్ రేసులతో రెచ్చిపోతున్న యువకులు
✬ గుంటూరు జిల్లా నేతకు YCP కీలక పదవి
✬ GNT: స్పీకర్, ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర సంభాషణ
✬ అమరావతి: అమరేశ్వరస్వామి ఆలయంలో పాములు
✬ చేబ్రోలు: ప్రమాదంలో తండ్రి మృతి.. విలపించిన కుమారుడు

శాసమండలిలో ప్రతిపక్ష నేతల తీరుపై మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్ ఆగ్రహించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతుండగా అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. సభను ఉద్దేశించి మాట్లాడకుండా అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటూ ఆక్షేపించారు. సభను కంట్రోల్‌లో ఉంచాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇటు హోం మంత్రి అనిత సైతం ప్రతిపక్ష సభ్యులపై ఫైర్ అయ్యారు.

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం సుమారుగా 1,00,000 ఏ/సి రకాలు చేరాయి. కేజీల వారీగా సీడు రకాల ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.130-135, సూపర్ డీలక్స్ రూ.160, తేజా మీడియం రూ.100-120, 355 భెడిగి బెస్ట్ రూ.110-130, 2043 భెడిగి రూ.120-130, 341బెస్ట్ రూ.120-150, 341.BCM రూ.120-140, సీజెంటా భెడిగి రూ.110-120, నె:5 రకం రూ.120-150, షార్క్ రకాలు రూ.110-150 వరకు ధర లభించింది.

పెదకాకాని మండల కేంద్రంలోని బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్ నుంచి గౌడ పాలానికి వెళ్లే రోడ్ దగ్గర ఓ కాలేజ్ బస్సు స్కూటీని ఢీకొంది. స్కూటీ మీద వెళుతున్న దంపతుల్లో.. భార్య పావని (23) మృతి చెందారు. భర్త శివకృష్ణ (25) కాళ్లు విరిగాయి. పెదకాకాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శబరిమల వెళ్లే జిల్లా వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లం (07145), మచిలీపట్నం-కొల్లాం స్పెషల్ (07147), కొల్లాం-మచిలీపట్నం స్పెషల్ (07148) టైన్స్‌ను గుంటూరు మీదుగా వెళ్తాయని డీఆర్ఎం ఎం. రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని తెనాలి, బాపట్ల, చీరాలలో ఆగుతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.