Guntur

News April 4, 2024

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హౌరా-యశ్వంతపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారి బుధవారం తెలిపారు. ఈనెల 4, 11 తేదీల్లో ఈ రైలు (02863) హౌరాలో 12.40 గంటలకు బయలుదేరి విజయవాడ మరుసటి రోజు 07.25, గుంటూరు 08.20, యశ్వంతపూర్ శనివారం 00.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02864) ఈనెల 6, 13 తేదీల్లో యశ్వంతపూర్‌లో 5 గంటలకు ప్రారంభమై గుంటూరు 17.25 వస్తుంది.

News April 4, 2024

తెనాలి: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

image

నీటి తొట్టెలో పడి మూడేళ్ల పాప మృతి చెందిన ఘటన తెనాలి యడ్లలింగయ్య కాలనీ శివారు పొలాల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి తొట్టెలో పడిందని, ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

News April 4, 2024

ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిషేధం: కలెక్టర్

image

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటిస్తూ.. తమ ప్రచారాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు ప్రార్థనా మందిరాల్లో ప్రచారాలు నిర్వహించకూడదన్నారు. పార్టీ కండువాలతో వెళ్లొద్దని సూచించారు.

News April 3, 2024

13000 మంది ఉద్యోగులతో జీరో రీ పోల్ సాధ్యం: కలెక్టర్

image

జిల్లాలోని 13000 ఎన్నికల సిబ్బంది ఎన్నికల రోజూ బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే జీరో రీ పోల్ సాధ్యమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలను రిటర్నింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News April 3, 2024

చిలకలూరిపేట: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య

image

మండలంలోని మురికిపూడి గ్రామంలో ఎద్దు ఏసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం చిలకలూరిపేటలో డీఎస్పీ వర్మ మాట్లాడుతూ.. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మృతుడు ఏసుబాబు భార్య రజని, ప్రియుడు మురళీకృష్ణ, మరికొంత మంది కలిసి గత నెల 28వ తేదీన ఏసుబాబును హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

News April 3, 2024

పవన్ కళ్యాణ్ నేటి తెనాలి పర్యటన రద్దు

image

నేటి సాయంత్రం తెనాలిలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెనాలిలో పర్యటన కోసం పార్టీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే.

News April 3, 2024

పొన్నూరు వద్ద ఆటో ఢీ.. వ్యక్తి మృతి

image

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు వద్ద జిబిసి రోడ్డుపై మంగళవారం ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లలూరుకు చెందిన చందు సురేంద్ర ద్విచక్ర వాహనంపై వస్తుండగా పొన్నూరు నుంచి గుంటూరు వెళుతున్న టాటా మ్యాజిక్ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2024

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిపై పోక్సో కేసు

image

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన రేపల్లెలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రేపల్లె 8వ వార్డుకు చెందిన 4వ తరగతి చదివే బాలికపై సాయి పవన్ (23) అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలో కూలి పనులు చేసుకునే సాయి పవన్ ఇటీవల రేపల్లె వచ్చాడు. ఆడుకుంటున్న బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News April 3, 2024

గుంటూరు అదనపు ఐజీగా అశోక్‌ కుమార్‌ బాధ్యతలు

image

ఏలూరు ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌కు గుంటూరు రేంజ్‌ అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు ఐజీ జి. పాలరాజును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఏలూరు ఐజీ అశోక్‌ కుమార్‌ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

News April 3, 2024

నేడు తెనాలి రానున్న జనసేన అధినేత పవన్

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్‌లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ తెనాలి మార్కెట్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ సుమారు 6 గంటలకు బహిరంగ సభ ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.