India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం (M), ఎం.కె.పురానికు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ట్వీట్‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. పోలీసులు మితిమీరి వ్యవహరించినందుకు లోకేశ్ క్షమాపణ చెప్పడం, విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం పట్ల GVL లోకేశ్‌ను అభినందించారు. దీనికి ప్రతిగా లోకేశ్ ‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేయడమే నా లక్ష్యం‘ అని ట్విట్ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో CRDA పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల పై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, మునిసిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రైతాంగానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జీడీసీసీ బ్యాంకు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్ కుమార్‌లకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఫిర్యాదు శుక్రవారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో బినామీ పేర్లతో రుణాలు ఇచ్చారని, ఆనాటి పాలకవర్గంపై కేసు నమోదు చేయాలన్నారు. నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి ఘటనలో మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు కొత్తపేటకు చెందిన బుజ్జిబాబు, ఆదిత్య నగర్‌కు చెందిన సత్యనారాయణ, గుజ్జనగుండ్ల చెందిన మణికంఠను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 మందిని అరెస్టు చేశామన్నారు.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల(07781), 5 నుంచి 12వ వరకు మాచర్ల-విజయవాడ(07782) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి-విజయవాడ-కాజీపేట మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు గుంటూరు-పగిడి పల్లి మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయన్నారు.
మంగళగిరి పరిధి గణపతి నగరంలోని మొదటిలో నాగేంద్రం అనే వ్యక్తి అద్దెకి నివసిస్తూ విజయవాడలో బంగారం పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతిరోజు మాదిరిగా గురువారం పనికి వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంటిలోని ఏసీ గ్యాస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఆయన నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వస్తువులు మొత్తం దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.18 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
➤ గుజ్జనగుండ్లలో శుక్రవారం జాబ్ మేళా
➤ రషీద్ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
➤ రూ.1,600 కోట్లు బకాయి పెట్టింది జగన్ కాదా.?: మంత్రి లోకేశ్
➤ నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా చేరుతున్న వరద
➤ ఎయిమ్స్‌లో పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
➤ 300ల సెల్ ఫోన్‌లు అందించిన GNT ఎస్పీ
➤ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం: నారా లోకేశ్
➤ నా మొదటి జీతం ప్రజలకే: MLA మాధవి
➤ మమ్మల్ని మన్నించండి కామ్రేడ్: లోకేశ్
నేడు పింఛన్ల పంపిణీలో భాగంగా మడకశిరలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా CPI(M), ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించగా.. మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. కొందరు పోలీసుల తీరు ఇంకా మారలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.
Sorry, no posts matched your criteria.