Guntur

News March 29, 2024

దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కడియాల లక్ష్మి

image

నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు కోడలు డాక్టర్ కడియాల లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి గొట్టిపాటి నరసయ్య కూతురు.

News March 29, 2024

టీడీపీలో చేరిన మల్లెల రాజేశ్ నాయుడు

image

కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి  నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.

News March 29, 2024

టీడీపీలోకి మల్లెల రాజేశ్ నాయుడు.?

image

చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

News March 29, 2024

చిలకలూరిపేట: అజ్ఞాతంలోకి 12 మంది YCP కౌన్సిలర్లు.?

image

చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్‌కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

News March 29, 2024

గుంటూరు: పోలింగ్‌ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభం

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.

News March 29, 2024

గుంటూరు జిల్లాలో సీనియర్లు లేకుండానే బరిలోకి TDP

image

గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు TDP కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి పలువురు సీనియర్లు లేకుండానే TDP ఎన్నికలకు వెళ్తోంది. వయోభారంతో రాయపాటి బ్రదర్స్ రాజకీయాలకు దూరం కాగా, ఆలపాటి రాజా, కొమ్మలపాటి శ్రీధర్‌లకు టికెట్లు దక్కలేదు. మరోవైపు, కోడెల శివప్రసాద్ వారసుడికి కూడా టికెట్ కేటాయించలేకపోయారు. ఆలపాటి ఆశించిన టికెట్ నాదెండ్ల మనోహర్‌కి, పెదకూరపాటు టికెట్ భాష్యం ప్రవీణ్‌కు దక్కిన విషయం తెలిసిందే.

News March 29, 2024

బాపట్ల ఎంపీగా గెలిచేదెవరు?

image

2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్‌కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. 

News March 29, 2024

గుంటూరు మిర్చియార్డుకు వరుస సెలవులు

image

గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. మూడు రోజులు పాటు మిర్చి క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సాధారణంగా లావాదేవీలు జరగవు. ఈ వారంలో మూడు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డు నిర్వాహకులు తెలిపారు.

News March 29, 2024

సరిహద్దు ప్రాంతాలలో నిరంతర నిఘాను ఏర్పాటు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ, పల్నాడు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరుగకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.

News March 28, 2024

ఈవీఎంలు పల్నాడు, బాపట్ల జిల్లాకు కేటాయించాం

image

ఎన్నికల సంఘం గుంటూరు GMCకి కేటాయించిన EVMలలో కొన్నింటిని గత ఏడాది పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇచ్చామని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరుకి అవసరమున్నందున వాటిని తిరిగి ఆయా జిల్లా అధికారులు శనివారం అందించనున్నారని కమిషనర్ తెలిపారు. వచ్చిన ఈవీఎంలను గోడౌన్ నందు భద్రపరుచుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.