Guntur

News July 31, 2024

సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త భేటీ

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను సత్కరించారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇద్దరు చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై మైఖేల్ క్రేమర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోన్నట్లు సమాచారం. 

News July 31, 2024

మంగళగిరి TDP ఆఫీసుపై దాడి..ముగ్గురు పోలీసులపై వేటు

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై గత ప్రభుత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట  త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. సీఐ, ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. అల్లరి మూకల దాడి అరికట్టలేకపోయారని, దాడి తర్వాత కనీస ఆధారాలు సేకరించలేకపోయారని అప్పటి రూరల్ సీఐ భూషణం, ఎస్సైలు లోకేశ్, క్రాంతి కిరణ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 31, 2024

నేటి నుంచి ఆగస్టు 5 వరకు లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

తాడేపల్లి నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమం బుధవారం నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రద్దు చేసినట్లు మంగళవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగే సమయం, తేదీలను ప్రకటిస్తామని, ప్రజలు సహకరించాలని వారు ఆ ప్రకటనలో కోరారు.

News July 31, 2024

ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి: షర్మిల

image

ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు కలిగించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వాన్ని నడిపే వారే భాద్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేయొచ్చా? మీ వివేకానికి వదిలేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చకుండా పూర్తిగా నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

News July 30, 2024

అమరావతి నిర్మాణానికి రూ. 4 లక్షల విరాళం

image

రాజధాని అమరావతి కోసం మధుస్మిత అనే మహిళ మంగళవారం రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని CM పిలుపునిచ్చారు.

News July 30, 2024

నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్

image

వన్య ప్రాణులు, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో అలుగును అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అధికారులపై దాడి జరిగిన ఘటనపై మంగళవారం ఆయన ఆరా తీశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News July 30, 2024

పలు శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

image

గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గిరిజనుల స్థితిగతులు, వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, గిరిజన హాస్టల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు గంజాయి కట్టడిపై సీఎం చర్చిస్తున్నారు.

News July 30, 2024

నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం సచివాలయంలో గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖలపై చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష చేస్తారు.

News July 30, 2024

‘అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి’

image

రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరగా అమలు చేయాలన్నారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తేనే మహిళలకు పథకం వర్తిస్తుందన్నారు. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు.

News July 29, 2024

ప్రతి హామీని అమలు చేస్తాం: కొమ్మలపాటి

image

రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, వైసీపీ కావాలనే లేనిపోని విమర్శలు చేస్తుందని పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. నరసరావుపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా గడవకముందే పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.