India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖాధికారులను, సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనదేనని, నీటి ప్రవాహం వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను శనివారం మధ్యాహ్నం నాటికి విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు
టీడీపీ అనుబంధ తెలుగు యువత విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగశ్రవణ్ కిలారు శనివారం విజయవాడలో మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. అదనంగా రూ.5 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఇతర వస్తువులను బాధితుల కోసం అందజేసినట్లు నాగశ్రవణ్ తెలిపారు.
అమాయక మాటలతో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠాలోని తల్లి కూతుళ్ల నేరచరిత్ర ఇది. 2022 మార్కాపురంలో ఆస్తికోసం మేనత్తను సైనైడ్‌తో చంపిన వైనం, 2023 తెనాలిలో అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధురాలని కూల్ డ్రింక్‌లో సైనెడ్ కలిపి చంపేశారు. 2024 తెనాలిలో బీమా డబ్బులు కోసం మద్యంలో సైనెడ్ కలిపి వ్యక్తిని చంపారు. వీరిని గుంటూరు పోలీసులు నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఓ ఫోన్ కాల్‌తో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తన భర్త సోనోవిజన్లో పనిచేస్తున్నాడని, తాను చనిపోతున్నా అంటూ సెల్ఫీ వీడియో పంపించారని కాపాడాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ని ఓ మహిళ కోరింది. స్పందించిన ఆయన.. ఐటీ విభాగం ద్వారా ఆ వ్యక్తి తాడేపల్లిలో ఉన్నట్లు గుర్తించి తాడేపల్లి సీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు కాపాడారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న కృష్ణా జిల్లాల సైతం నేడు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇటీవల ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల ధ్వంసంపై విచారణ చేయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆ గేట్లు శుక్రవారం మరమ్మతులు చేశారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ అధికారులు 8గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.68 లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1.91 క్యూసెక్కులుగా ఉంది.
కృష్ణ పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉండటంతో నాగార్జున్ సాగర్ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం రాత్రి 24 రేడియల్ క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 2,36,302 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 589.90 అడుగులు ఇది 311.7462 టీఎంసీలకు సమానం.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు మంగళగిరి కోర్టు 2వారాలు రిమాండ్ విధించగా గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.