India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్లు, విక్రయించే దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో మాట్లాడారు. బాణాసంచా తయారీ, విక్రయాలు చేసే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గుంటూరులో రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి వివరాలను ఆయన వ్యక్తిగత పీఏ విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి గుంటూరు చేరుకుంటారు. అనంతరం గుంటూరు GGHలో ప్రేమోన్మాది చేతిలో బ్రెయిన్ డెడ్ అయి చికిత్స పొందుతున్న సహాన కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి జగన్ బద్వేల్ చేరుకుంటారు.
HYD చందానగర్ PS పరిధిలో సోమవారం విషాదం వెలుగు చూసింది. స్థానికులు వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉదయ్(23) రామచంద్రాపురం పరిధి అశోక్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి చందానగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. 3డో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క అతడిని తరిమింది. తప్పించుకునే క్రమంలో కిటికీలో నుంచి కిందపడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీఎస్సీ-2024కి హాజరయ్యే షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. అభ్యర్థులను స్థానిక సచివాలయంలో 6 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుకు ఎంపిక చేస్తారన్నారు. jnanbhumi.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబరు 3న ఆన్‌లైన్లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది.
కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉండవల్లిలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, MLC అశోక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి శ్రీపానకాలస్వామి ఆలయంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పానకం ధరను మంత్రి లోకేశ్ ఆదేశానుసారం దేవస్థానం అధికారులు తగ్గించి సోమవారం నుంచి భక్తులకు విక్రయించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్త వెనిగళ్ళ ఉమాకాంతం హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. బెల్లం పానకం రూ.30, పటిక బెల్లం పానకం రూ.35 భక్తులకు విక్రయించడం హర్షనీయమన్నారు.
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు వెలగపూడిలోని వృద్ధురాలి హత్యకేసులో వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ మంగళగిరి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు పోలీసులు శనివారం, ఆదివారం కస్టడీకి తీసుకొని విచారించారు. కాగా ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ పొడిగించింది. దీంతో తిరిగి నందిగం సురేశ్‌ను జిల్లా జైలుకు తరలించారు.
ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులే నేరాలు, ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ పాలనలో వేలమంది చనిపోయినా, ఏ నాడు ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్ అని అన్నారు. అనంతబాబు లాంటి వ్యక్తి దళితులని చంపితే, ఇంటికి పిలిపించి భోజనం పెట్టావ్. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్ అని ఆదివారం లోకేశ్ ట్వీట్ చేశారు.
మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి ఒక బిందె పానకం రూ.30 రూపాయలకే భక్తులకు అందిస్తున్నట్లు దేవస్థాన ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు పానకం నివేదన ఉంటుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.