Guntur

News July 23, 2024

నేడు నారా లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ నేడు రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

News July 23, 2024

బాపట్ల: ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బాపట్ల జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌ను ఆయన పరిశీలించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, ఆర్డీవో రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్‌పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్

News July 22, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

గుంటూరు శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఉప్పలపాడు-తగరపాలెం అడ్డరోడ్డు దగ్గర గోపాలకృష్ణ రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన లారీ అతణ్ని ఢీకొనడంతో గోపాలకృష్ణ రెండు టైర్లకింద నలిగి అక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పెదకాకాని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News July 22, 2024

మంగళవారం లోకేశ్ ప్రజా దర్బార్ రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేశ్ తాడేపల్లిలోని ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన, ప్రజా దర్బార్ మంగళవారం రద్దు చేసినట్లు లోకేశ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సమయాభావం వలన కార్యక్రమం రద్దు చేశామన్నారు. మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుపుతామన్నారు. ప్రజా దర్బార్‌కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

News July 22, 2024

నూజివీడు IIIT విద్యార్థులకు మంత్రి లోకేశ్ భరోసా

image

నూజివీడు IIIT విద్యార్థులు పలు సమస్యలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఉన్నత లక్ష్యంతో IIITలో చేరితే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని, ఉపాధ్యాయులు ల్యాబ్ మార్కుల విషయంలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై స్పందించిన మంత్రి లోకేశ్ సమస్య తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్యను పరిష్కరిస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

News July 22, 2024

50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్: గుంటూరు కలెక్టర్

image

పచ్చదనాన్ని పెంచి వాతావరణ సమతౌల్యం సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ఇందుకోసం 50 లక్షల మొక్కలతో మెగా ప్లాంటేషన్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రక్రియ
వారంలోపు పూర్తి కావాలన్నారు. మెగా ప్లాంటేషన్ నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించారు.

News July 22, 2024

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కీటక జనిత, కలుషిత నీటి కారక వ్యాధులు, సీజనల్ వ్యాధులు నివారణ, వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News July 22, 2024

వైసీపీకి మాజీ MLA మద్దాలి గిరి రాజీనామా

image

గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నేడు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను వైసీపీ అధినేత YS
జగన్‌కు అందజేశారు. తమ రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో గుంటూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మద్దాలి గిరి అనుచరులు ఎవరూ ఫోన్‌లో అందుబాటులో లేరు.

News July 22, 2024

అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి.. లోకేశ్ స్పందన

image

తెనాలి ఐతానగర్‌కు చెందిన వైద్యురాలు హారిక(25) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మృతదేహం స్వస్థలం చేరుకునేందుకు సాయం చేయాలని మంత్రి లోకేశ్‌ను పలువురు సోషల్ మీడియాలో కోరారు. దీనిపై మంత్రి స్పందించారు. హారిక మృతి విషయం బాధ కలిగించిందని లోకేశ్ పేర్కొన్నారు. మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ ఎంబసీతో చర్చిస్తుందని వివరించారు.