Guntur

News March 19, 2024

హిందీ పరీక్ష రాసిన విద్యార్థికి న్యాయం చేస్తాం: కారంపూడి అధికారులు

image

పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్‌లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.

News March 19, 2024

చిలకలూరిపేట: రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు

image

మొన్నటి వరకు చిలకలూరిపేట YCP ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కావటి మనోహర్‌‌ను ఇక్కడి ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం.. ఆయనకే MLA టికెట్ ఇచ్చింది. తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్న రాజేశ్ సీఎం పిలుపు మేరకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీంతో పాటు ఆయన ఇటీవల మంత్రి రజినీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సీఎంవో నుంచి పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 19, 2024

బాపట్ల: రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలివే!

image

బాపట్లలో సోమవారం సాయంత్రం <<12879418>>రైలు కిందపడి<<>> మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 19, 2024

గురజాల: కరపత్రాలు పంచిన వాలంటీర్.. విధుల నుంచి తొలగింపు

image

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్‌ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్‌ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్‌ను స్వాధీనపరుచుకున్నారు.

News March 19, 2024

గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.

News March 19, 2024

గుంటూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

image

గుంటూరులో లాడ్జిలపై సోమవారం కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ అన్వర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్పీ తుషార్, ఏఎస్పీ షెల్కే ఆదేశాలతో రైలుపేట ఆర్టీసీ బస్టాండ్, గుంటూరు తోట తదితర ప్రాంతాల్లోని లాడ్జిలపై తనిఖీలు నిర్వహించామన్నారు. వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

News March 19, 2024

గుంటూరు: ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలకు ఏర్పాట్లు

image

జీజీహెచ్‌లో ప్రతి రోజూ గుండె జబ్బుల ఓపీ సేవలను ఈ నెల 20వ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం ఆసుపత్రిలోని క్షయ నియంత్రణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. గుండె జబ్బుల ఓపీ సేవలు వారంలో 3 రోజులు మాత్రమే ఉన్నాయని, గుండె జబ్బుతో బాధపడే రోగులు రోజుకు 200 మంది వస్తుండటం వల్ల ప్రత్యేక ఓపీ సేవలు కేటాయించామన్నారు.

News March 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు వర్షసూచన

image

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు వాతవరణ శాఖ తీపికబురు చెప్పింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 18, 2024

లోకేశ్ మంగళగిరి సీటు వదులుకోవాలి: వెంకటేశ్వరరావు

image

ప్రస్తుతం ఎన్నికల్లో బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ కృష్ణ యాదవ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. సామాజిక న్యాయం పాటించకుండా వలస పక్షులకు సీట్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ క్రమంలో లోకేశ్ మంగళగిరి సీటును వదులుకోవాలని, బీసీలకు ఆ సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

News March 18, 2024

గుంటూరు: నలుగురు మహిళలకు MLA టికెట్లు

image

వైసీపీ ప్రకటించిన ఉమ్మడి గుంటూరు జిల్లా MLA అభ్యర్థుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. గుంటూరు వెస్ట్- విడదల రజిని.. గుంటూరు ఈస్ట్- నూరి ఫాతిమా.. తాడికొండ- మేకతోటి సుచరిత.. మంగళగిరి- మురుగుడు లావణ్యలకు టికెట్లు కేటాయించారు. రజిని చిలకలూరి పేట నుంచి గుంటూరుకు, సుచరిత ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు. లావణ్య, నూరిఫాతిమా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.