Guntur

News July 16, 2024

గుంటూరు రేంజి పరిధిలో పలువురు సీఐల బదిలీలు

image

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎక్కువగా పల్నాడు జిల్లాలోని వారికే స్థాన చలనం కలిగింది. మొత్తం 10మందిని ఐజీ బదిలీ చేయగా వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News July 16, 2024

ఫిరంగిపురం: బాలిక మృతి.. పోక్సో కేసు నమోదు

image

యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..  ఫిరంగిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటివద్దే ఉంటోంది. బాలికను మరో గ్రామ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో బాలిక తండ్రి అతన్ని మందలించాడు. నీలాంబరం, మరి కొందరు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది.

News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

News July 16, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు కొత్త బస్సులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో RTCకి కొత్త బస్సులు కేటాయించడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కొన్నాళ్లుగా డొక్కు బస్సులతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు కొత్త బస్సుల రాకతో ఊరట కలగనుంది. ఉమ్మడి జిల్లాకు RTC సొంత బస్సులు, అద్దె బస్సులు కలిసి 130 వరకు కొత్తవి సమకూరనున్నాయి. ఇప్పటికే 30 బస్సులు ఆయా డిపోలకు రాగా మిగిలినవి నెల నుంచి 2 నెలల వ్యవధిలో తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News July 16, 2024

గుంటూరు: కిడ్నీ రాకెట్ నిందితుడి అరెస్ట్

image

విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి బాషా అనే వ్యక్తిని పట్టుకున్నారు.

News July 16, 2024

రూ.15 కోట్లు టోకరా వేసిన ఔషధ వ్యాపారి

image

నరసరావుపేటలో ఓ ఔషధ వ్యాపారి అదృశ్యం కావడం సంచలనం రేకెత్తించింది. రాజాగారికోటలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి 2రోజులుగా కనిపించకపోవడంతో, అతనికి అప్పులిచ్చినవారు అతని అచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో దివాళా తీసినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని 2వ పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు.

News July 16, 2024

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ప్రతిపాదనలు: డీఈవో శైలజ

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు గుంటూరు డీఈవో పి. శైలజ తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీ తుది గడువు అని డీఈవో వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.‌

News July 15, 2024

గుంటూరు జిల్లాలో 110 పోస్టల్ ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గుంటూరు డివిజన్‌లో 29, తెనాలి డివిజన్‌లో 28, నరసరావుపేట డివిజన్‌లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ABPM అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT.

News July 15, 2024

పెమ్మసాని చొరవతో విజయవాడ- గూడూరు రైళ్ల పునరుద్ధరణ

image

విజయవాడ- గూడూరు, గూడూరు- విజయవాడ రైళ్లను పునరుద్ధరించారు. డబ్లింగ్, సిగ్నలింగ్ పనుల వల్ల ఇటీవల ఈ రైళ్లను రద్దు చేయగా.. వీటిని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్‌కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఉదయం లేఖ పంపారు. స్పందించిన రైల్వే శాఖ రద్దయిన ఆ రైళ్లను పునరుద్ధరించింది. వీటి రద్దు సమయంలో ఒంగోలు-బాపట్ల-తెనాలి ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.

News July 15, 2024

గుంటూరు: ఆరుగురు నిందితులకు బెయిల్ నిరాకరణ

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరులోని జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.