India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీలో మద్యం దుకాణాల అనుమతికి గుంటూరు, NTR జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 127 దుకాణాలకు 4,396 దరఖాస్తులు అందాయి. తొలి 10అత్యధిక దరఖాస్తుల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచే 8 ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు (104)దుకాణానికి 95దరఖాస్తులు, తుళ్లూరు (102) షాపునకు 86దరఖాస్తులు, తుళ్లూరు(103)దుకాణానికి 82 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

జిల్లా ప్రజలకు కలెక్టర్ అరుణ్ బాబు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకొంటారని ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ జిల్లా ప్రజలందరికీ మేలు చేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారని విమర్శించారు.

గుంటూరు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు ఎస్పీ సతీశ్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి నాడు.. అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈవీఎంలపై మాట్లాడటానికి సీఎం చంద్రబాబుకు సిగ్గుందా? అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. లోబీపీ, భుజం నొప్పి, ఛాతీ నొప్పి ఉందని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలోనే తనకు భుజం నొప్పి ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సురేశ్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.

అమరావతి: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.పామోలిన్ లీటర్ రూ.110, సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.124 చొప్పున అమ్మనున్నట్లు చెప్పారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున తక్కువ ధరలకు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రమంతా ఒకే ధరకు నూనెలు అమ్మాలని వ్యాపారస్తులకు ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు 11.15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా విద్యుత్ శాఖపై రివ్యూ చేస్తారు. అనంతరం మైనింగ్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని కార్యాలయం తెలియజేసింది

మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని ఆయా వర్గాలు తెలిపాయి. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరిస్తారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.