India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి ఒక బిందె పానకం రూ.30 రూపాయలకే భక్తులకు అందిస్తున్నట్లు దేవస్థాన ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు పానకం నివేదన ఉంటుందని చెప్పారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ఇంకా 10 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. జాతీయ కోటాలో మొత్తం 37సీట్లకు 35 భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో విద్యార్థులను కేటాయించారు. అదే విధంగా రాష్ట్ర కోటాలో 213 సీట్లకు 205 పూర్తయ్యాయి. వచ్చే వారం మూడో రౌండ్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
పోలీస్ అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు గుంటూరులో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం గుంటూరులో పోలీస్ సిబ్బంది ముందస్తు స్మృతి కవాతు సాధన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ శాంత కుమార్, ఆర్ ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వినుకొండ-గుంటూరు మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణంకు కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేపించుకుంది. ఈ సందర్భంగా పల్నాడులో రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పేరేచర్ల-కొండమోడు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు లైన్ల నిర్మాణంను కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. దీంతో పల్నాడు ప్రజలందరూ సీఎం చంద్రబాబు, ఎంపీ లావుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉండవల్లిలోని మంత్రి నివాసానికి రావద్దని, మళ్ళీ ప్రజా దర్బార్ జరిగే తేదీని త్వరలో చెప్తామని పేర్కొన్నారు.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కాచిగూడ-నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు(07791/07792)ను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో రేపల్లె నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు(17646) రేపల్లెలో 75 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘించిన కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలకు వచ్చే గర్భిణుల నుంచి లింగ నిర్ధారణపై అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.
పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలానికి చెందిన శైలజ శుక్రవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. వీరిద్దరూ గుంటూరులో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలంగా లవ్‌లో ఉన్న వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో ‘నీకు నచ్చినట్లు చేస్తా’ అని తండ్రి వాయిస్ మెసేజ్ పంపాడు. శుక్రవారం సాయంత్రం ఇంటికొస్తానని చెప్పిన మహేశ్ ఇంతలోనే సూసైడ్ చేసుకున్నాడు.
AP హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి గూగుల్ టీమ్ వీవర్‌లో కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. పోలీసుల సమాచారం మేరకు.. ఈ నెల 15వ తేదీన నేలపాడులోని హైకోర్టులో కోర్టు నంబర్ 17లో గుర్తుతెలియని వ్యక్తి కిట్టు అనే IDతో లాగిన్ అయ్యి కోర్టు ప్రొసీడింగ్స్ అని తెలిసి అవమానించాడని హైకోర్టు రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.