India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 10న పిడుగురాళ్ల బైపాస్ వద్ద సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం కొండమోడులో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని తెలిపారు. అలాగే 24న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు.
మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు (07169) ఈనెల 14, 21, 28 తేదీల్లో నర్సాపూర్లో 18.00 గంటలకు బయలుదేరి, విజయవాడ 21, 35, గుంటూరు 22: 45 సత్తెనపల్లి 23.24, పిడుగురాళ్ల 23: 56 సికింద్రాబాద్ 04.50 గంటలకు చేరుతుంది.
గుంటూరు పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న బెల్లంకొండ మండలానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు యువతికి తల్లిదండ్రులు లేరని ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఆదివారం యువతి నిస్సహాయ స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
చిలకలూరిపేట మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మామ బొగ్గల వరపు వీరయ్య ఆదివారం కన్ను మూశారు. ఇటీవల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వీరయ్య గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర నంతరం ఆరోగ్యం మెరుగుపడినా శనివారం సాయంత్రం మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
మండలంలోని అన్నవరప్పాడు బ్రిడ్జి వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు అన్నవరప్పాడు వెళ్తుండగా బ్రిడ్జి వద్ద లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలశౌరి అక్కడికక్కడే మృతి చెందిగా, వెంకటేశ్వర్లు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఇరువురికి గాయాలైన సంఘటన వినుకొండ మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం వినుకొండ కర్నూలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా స్థానికులు వారిని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి విడుదల రజనీ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారని ముస్లిం సేనా రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుభాని తెలిపారు. ఎన్నికల కోడ్కి విరుద్ధంగా మసీదులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ ఎన్నికల అధికారి రాజ్యలక్ష్మిని షేక్ సుభాని శనివారం కలిసి ఫిర్యాదు చేశారు. రజినీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.