Guntur

News July 10, 2024

నెల్లూరు జైలులో 2వ రోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు

image

సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.’

News July 10, 2024

మంగళగిరి TDP కార్యాలయంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

News July 10, 2024

పల్నాడు జిల్లాలో పులి సంచారం

image

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్‌ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు CC కెమెరాల్లో రికార్డయ్యింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్‌పిట్‌ల వద్దకు వస్తున్నాయని విజయపురిసౌత్‌ రేంజర్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే 4 రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని వివరించారు.

News July 10, 2024

నిత్యావసర ధరలు అందుబాటులోకి తెస్తాం: కలెక్టర్

image

నిత్యావసర ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం రైస్, డాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 11 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందన్నారు.

News July 9, 2024

దుగ్గిరాల: కాల్వలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

image

తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామానికి చెందిన ఓ ప్రయివేటు స్కూల్ బస్సు మంగళవారం దుగ్గిరాల బంగ్లా సమీపంలో, రివర్స్ చేస్తున్న సమయంలో గేర్ లివర్ పనిచేయకపోవడంతో కొమ్మమూరు కాల్వలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ఏడుగురు విద్యార్థులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News July 9, 2024

విజయవాడ ధీరజ్‌కు నారా లోకేశ్ అభినందనలు

image

విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభావంతుడైన ధీరజ్.. తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నీలో రజతంతో ధీరజ్ ఒలింపిక్స్ కోటా స్థానం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

News July 9, 2024

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై గుంటూరు ఏఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిరంగిపురం మండలానికి చెందిన షేక్ జహంగీర్ గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే రాళ్లు సరఫరాకు గత ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆపై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వాటిని కొనుగోలు చేయొద్దని అధికారులను ఆదేశించారన్నారు. దీనిపై అడిగితే పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

News July 9, 2024

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

image

YCP ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి TDP కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపించారు. మరోవైపు పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కృష్ణారెడ్డి కోరడంతో విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.

News July 9, 2024

గుంటూరు: ‘పదోన్నతులకు వైద్య సిబ్బంది దరఖాస్తు చేసుకోండి’

image

గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ, మేల్) పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆర్డీ డాక్టర్ జి. శోభా రాణి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీహెచ్‌ఓ పోస్టులకు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎంపీహెచ్ఈఓ పని చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 9, 2024

గుంంటూరు యార్డుకు 29,187 బస్తాల మిర్చి రాక

image

గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 29,187 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 26,159 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.16,500 వరకు పలికింది. దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 7,500 నుంచి 19,000 వరకు లభించింది.