India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందినట్లు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వీధి నిర్వహణలో ఉన్న రజ్జుబాషా అకాల మరణం బాధాకరమన్నారు. నేటి సాయంత్రానికి ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంటుందని తెలిపారు. వారి కుటుంబానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.
మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.
గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను గురువారం మూసివేయాలని బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌లో భాగంగా.. ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ.. ఈ బంద్ చేపట్టినట్లు SFI నాయకులు తెలిపారు.
నరసరావుపేట మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు- సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17253)ను, ఈ నెల ఒకటి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఔరంగాబాద్- గుంటూరు రైలు (17254) తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో నడుస్తుందని వివరించారు.
మండలంలోని చిన్నతురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి చెట్లకు ఇనుప మేకులు కొట్టి, రోడ్డు కూడలిలో నిమ్మకాయలు వేసి, పసుపు, కుంకుమ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్తున్నారు. దాంతో ఇనుప మేకులు కొట్టిన చెట్లను గ్రామస్థులు నరికివేస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా రాత్రులు కాపలా కాస్తున్నారు. అయితే క్షుద్రపూజల భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంధ్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ తొలి సమావేశం 4వ తేదీ గురువారం రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో ఉదయం 11.00 గంటల నుంచి జరుగనున్నట్లు చెప్పారు.
దుర్గి మండలం బుగ్గవాగు రిజర్వాయర్లో ఒక గుర్తు తెలియని మృతదేహం బుధవారం లభ్యమైనట్లు స్థానికులు తెలియజేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి దుర్గి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి సంబంధించిన సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ (సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.