India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజుపాలెం మండలం ఉప్పలపాడుకి చెందిన కస్తూరి మహేశ్ (30) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని తండ్రి సాంబయ్య సోమవారం పెన్షన్ తీసుకుని పనిమీద ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. అయితే అతను వెళ్లిన మరుసటిరోజు కొడుకు చనిపోగా.. తండ్రికి కొడుకు మరణవార్త తెలియకపోవడంతో అంత్యక్రియలు చేయకుండా తండ్రి కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలో తెల్లచొక్కాతో ఉన్నది కనిపించని తండ్రి, కారులో చనిపోయిన కొడుకు.
విజయవాడ రూరల్ మండలం పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి తీవ్ర కలకలం సృష్టించింది. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి బండ్రపల్లి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న ఉదయం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం వెల్లడించింది. ఉదయం 11.00 గంటలకు సచివాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 03.00 గంటలకు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.
సాయంత్రం 05.00 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారని సీఎం కార్యాలయం తెలియజేసింది.
మండలంలోని వెన్నదేవి గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సత్తెనపల్లికి మండలం కట్టవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల వెంకట రామిరెడ్డి హైదరాబాదు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, వెన్నాదేవి వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట రామారెడ్డి (55) మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ వృద్ధురాలు మంగళవారం బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తన పట్ల అదే గ్రామానికి చెందిన ఇంటి పక్క వీధిలో ఉండే 70 ఏళ్ల వరికూటి సీతారామయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామీణ సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సముద్రంలో వేటకు వెళ్లి బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందినట్లు బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపారు. బాపట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కుర్రు కిరణ్ అనే వ్యక్తి సముద్రంలో వేటకు వెళ్లి, అలల తాకిడికి బోటు బోల్తాపడి వలకు చిక్కుకొని మృతి చెందినట్లు మృతుడి తండ్రి తెలిపారన్నారు. మృతుడు తండ్రి అగ్గులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట మురళి నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా కలెక్టర్‌గా రానున్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా కలెక్టరుగా పని చేసిన రంజిత్ బాష ఇటీవల కర్నూలు జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ సైతం అన్నమయ్య జిల్లాకు బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌గా వెంకట మురళి రానున్నారు.
కారంపూడి మండలం పెదకోదమగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ టీచర్ ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామస్థులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్‌పై దాడికి యత్నించారు. దీంతో తల్లిదండ్రులను అడ్డుకుని శాంతింపజేశామని ఉపాధ్యాయులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మెగా డీఎస్సీని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలోమంగళవారం సమీక్ష నిర్వహించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు మంత్రికి వివరించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పి.అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న అరుణ్ బాబు పల్నాడు కలెక్టర్‌గా రానున్నారు. అరుణ్ బాబు గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీవోగా పని చేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ బదిలీ అయ్యారు. ఆయన పోస్టింగుపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
Sorry, no posts matched your criteria.