India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.
కంటైనర్ లారీ ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ రావు గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నారు. కొలనుకొండ సాయిబాబా మందిరం సమీపంలో లారీ వెనక నుండి ఢీకొట్టింది. మోహన్ రావు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నరసరావుపేటలో స్త్రీల వైద్య నిపుణురాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేయనున్నారు. గొట్టిపాటి లక్ష్మి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళగా గుర్తింపు ఉంది. అద్దంకి టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.. దర్శి నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై పోటీ చేయనున్నారు.
గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఐదుగురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నరసరావుపేట నేతలు తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల శాసనసభ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివ శంకర్ సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియలో భాగంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. భద్రత పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు.
గుంటూరు క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతురాజు, సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషాలకు ఉగాది పురస్కారాలు డీజీపీ డిస్క్ అవార్డులకు ఎంపికయ్యారు. వారిని శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్న అధికారులు మాట్లాడుతూ.. తాము చేసిన సేవలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయటం సంతోషంగా ఉందని చెప్పారు.
గుంటూరులో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రటిష్టంగా అమలు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు సరైన పత్రాలు చూపని రూ.7,62,850 నగదును సీజ్ చేశామని చెప్పారు.
నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు కోడలు డాక్టర్ కడియాల లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి గొట్టిపాటి నరసయ్య కూతురు.
కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.
Sorry, no posts matched your criteria.