India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్‌కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.
గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు TDP కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి పలువురు సీనియర్లు లేకుండానే TDP ఎన్నికలకు వెళ్తోంది. వయోభారంతో రాయపాటి బ్రదర్స్ రాజకీయాలకు దూరం కాగా, ఆలపాటి రాజా, కొమ్మలపాటి శ్రీధర్‌లకు టికెట్లు దక్కలేదు. మరోవైపు, కోడెల శివప్రసాద్ వారసుడికి కూడా టికెట్ కేటాయించలేకపోయారు. ఆలపాటి ఆశించిన టికెట్ నాదెండ్ల మనోహర్‌కి, పెదకూరపాటు టికెట్ భాష్యం ప్రవీణ్‌కు దక్కిన విషయం తెలిసిందే.
2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్‌కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
గుంటూరు మిర్చియార్డుకు మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. మూడు రోజులు పాటు మిర్చి క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో సాధారణంగా లావాదేవీలు జరగవు. ఈ వారంలో మూడు రోజులు మాత్రమే క్రయవిక్రయాలు జరిగాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలని యార్డు నిర్వాహకులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట, నల్గొండ, పల్నాడు జిల్లాల అధికారులతో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ శంకర్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతాల గుండా నిబంధనలు అతిక్రమించి చట్ట వ్యతిరేకంగా అక్రమ నగదు, మద్యం, ఇతర వస్తువులు రవాణా జరుగకుండా నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నికల సంఘం గుంటూరు GMCకి కేటాయించిన EVMలలో కొన్నింటిని గత ఏడాది పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇచ్చామని నగర కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరుకి అవసరమున్నందున వాటిని తిరిగి ఆయా జిల్లా అధికారులు శనివారం అందించనున్నారని కమిషనర్ తెలిపారు. వచ్చిన ఈవీఎంలను గోడౌన్ నందు భద్రపరుచుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో ఎన్నికల వేళ చేసే ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత అని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. వివాదాస్పద పోస్టులు, కామెంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుంచి తొలగించాలని, అలాంటి పోస్టుల వివరాలు పోలీసులకు సమాచార ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
Sorry, no posts matched your criteria.