Guntur

News June 29, 2024

CM పర్యటనకు పగడ్బందీగా ఏర్పాట్లు: గుంటూరు కలెక్టర్

image

జులై ఒకటో తేదీన తాడేపల్లి మండలం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న సందర్భంగా.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమె తన కార్యాలయంలో సీఎం పర్యటనపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

News June 29, 2024

జూలై 1న పెన్షన్ల పంపిణీ: గుంటూరు కలెక్టర్

image

జూలై 1 ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. పెన్షన్ల పంపిణీపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీకి చేసిన ఏర్పాట్లను వివరించారు.

News June 29, 2024

నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 29, 2024

నరసరావుపేట: మాజీ మంత్రి పీఏ, మరిదిపై వ్యాపారుల ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 29, 2024

గుంటూరు జీజీహెచ్‌లో కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని వైద్య అధికారులతో కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఎంఆర్ఐ, ఐసీయూ విభాగాలను ఆయన పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు.

News June 29, 2024

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరం: మంత్రి లోకేశ్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీనివాస్ చెరగని ముద్రవేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News June 29, 2024

చంద్రబాబును కలిసిన TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

image

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

News June 29, 2024

గుంటూరు: పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 28, 2024

పిన్నెల్లి అరెస్టుతో పల్నాడు ప్రశాంతంగా ఉంది: MLA భాష్యం

image

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్‌గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.

News June 28, 2024

హిందూపురం ఎంపీని కలిసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

image

హిందూపురం ఎంపీ బి.కే పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆమె ఎంపీతో చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ గల్లా మాధవికి సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.