India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరగా అమలు చేయాలన్నారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తేనే మహిళలకు పథకం వర్తిస్తుందన్నారు. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, వైసీపీ కావాలనే లేనిపోని విమర్శలు చేస్తుందని పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ పేర్కొన్నారు. నరసరావుపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా గడవకముందే పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పవన్ కళ్యాణ్ తిలకించారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. సోమవారం తాడేపల్లిలో వారు మాట్లాడుతూ.. ముందుగా ప్రకటించిన విధంగా ఆగస్టు 3 వరకే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గడువు పొడిగింపు తేదీ ఉండదని, అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ట్వీట్‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి కౌంటర్ ఇచ్చారు. ‘మూడేళ్ల క్రితం నా వయస్సు 23. నేను USలో చదువుతున్నా. అప్పుడు మీ పార్టీ ప్రతీకార రాజకీయాలతో మా నాన్నను అన్యాయంగా అరెస్టు చేశారు. ఆ సమయంలో మేము అనుభవించిన బాధ ఏంటో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు నూరు శాతం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 2,60,192 మందికి రూ.110.69కోట్లు పంచాల్సి ఉంది. జిల్లాలో గత నెలలో పింఛన్ పంపిణీలో 4664 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగస్ట్ నెలలో ఒక్కో ఉద్యోగికి 50-100 మంది ఉండేలా మ్యాపింగ్ చేస్తున్నారు.
మంగళగిరి పరిధి పెదవడ్లపూడి శివారులో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల మేరకు.. కెనాల్ గేటు మీదపడటంతో శ్రీహర్ష(14) అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడు అక్కడికి ఎందుకు వెళ్లాడు, ఎలా మృతి చెందాడనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్తిపాడు-పరుచూరు రోడ్డులో ఆదివారం రాత్రి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెదనందిపాడుకు చెందిన వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు చెన్నైలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడని, సెలవులకి సొంత గ్రామానికి వచ్చాడని తండ్రి నాగేశ్వరరావు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 31న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరరావు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరు కానప్పటికీ, స్పాట్ అడ్మిషన్‌ల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు.
ఒలింపిక్ష్ 2024లో భారత్ నుంచి మను భాకర్ తొలి పతకం (బ్రాంజ్) గెలిచారు. దీనిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పందించారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశానికి తొలి పతకం అందించిన మను బాకర్‌కు అభినందనలు. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్యం సాధించిన స్ఫూర్తితో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని xలో ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.