India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిలో ఆదివారం సుప్రీంకోర్టు మాజీ సీజేఐ NV రమణ నివాసంలో ఆయనను సీఎం చంద్రబాబు కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో గంటకుపైగా కేంద్ర, రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.
నాదెండ్ల మండలంలో ఓ బాలికపై మౌలాలి అనే వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చికెన్ దుకాణంలో పనిచేసే మౌలాలి(60) సదరు బాలికను షాపులోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఆ వృద్ధుడిని నిలదీయగా భయంతో అతడు పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బలరామిరెడ్డి తెలిపారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటూ గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. అరండల్ పేట పోలీసుల ప్రకారం.. ఆన్‌లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించాడు. తొలుత శ్రీనివాసరావు నమ్మకపోవడంతో సదరు వ్యక్తి తనకు ట్రేడింగ్‌లో వచ్చిన లాభాలు చూపి అతనిని నమ్మించి పలు దఫాలుగా రూ.50 లక్షలకు పైగా జమ చేయించారు. ఎంతకీ డబ్బులు రావకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంబీఏ జనరల్, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు నిర్వహించిన ఐసెట్‌లో అర్హత సాధించిన వారికి సోమవారం కౌన్సెలింగ్ ఏర్పాటుచేశామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఎంబీఏలో 10, ఎంసీఏలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ANU ఐసెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా రేపు ఉదయం పీజీ ప్రవేశాల విభాగానికి రావాలని చెప్పారు.
గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఆగస్ట్ 12,13 తేదీల్లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని గుంటూరు రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నం.17646 240 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుందన్నారు. 11వ తేదీన సంత్రగచ్చి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 13వ తేదీన సికింద్రాబాద్-సంత్రగచ్చి మధ్య నడిచే రైలు వరంగల్, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో నడపనున్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి, వాటి ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జర్నలిస్టులపై దాడులు, బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు, పవన్‌లు స్పందించారు. తాడేపల్లిలో శనివారం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అది పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతరం జర్నలిస్టులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. అమరావతిలో నిర్మాణ, సర్వే రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. నిర్మాణ రంగానికి ఎలాంటి నైపుణ్యం గల వారు కావాలో తెలుసుకుని సిద్ధం చేయాలన్నారు.
గుంటూరు ఏ.టీ అగ్రహారం 7వ లైన్‌లో రేపు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలు జరగనున్నాయని సేవా సమితి అధ్యక్షుడు రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనిరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మహోత్సవాలకు ఆహ్వానించారు. 28న ఆదివారం కల్యాణ మహోత్సవం, 29వ తేదీన ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీహరి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.
వినుకొండలో రషీద్ హత్య కేసులో 20మందికి పైగా నిందితులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు, నిందితుడి మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. హత్యకు ముందు నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో కలిసి మద్యం తాగి, హత్యకు సిద్ధమైనట్లు రిపోర్టులో వివరించారు. హత్య జరుగుతున్న సమయంలో నిందితులు కర్రలతో కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.