India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు మిర్చియార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు సోమవారం హోలీ సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో యార్డులో 3 రోజులు పాటు క్రయవిక్రయాలు జరగవు. కర్ణాటకలో బాడిగ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభం కావడంతో.. ఆ ప్రాంత రైతులు అక్కడికే సరకు తరలిస్తున్నారు. దీంతో శుక్రవారం ఒక్కసారిగా మిర్చియార్డుకు సరకు తగ్గింది.
మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.
గుంటూరులోని అమరావతి రోడ్డు వేలంగిని నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రచారం చేసి, ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారంటూ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. శుక్రవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, సీనియర్ కోవెలమూడి రవీంద్ర ప్రచారం నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రచారం చేశారని వీరితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును TDP అధిష్టానం కృష్ణ ప్రసాద్‌కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు సన్నిహితుడిగా పేరు ఉన్న జంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన
టీడీపీలో చేరి గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జంగా రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.
టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని శిక్షించాలని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు.
ఆర్మీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించి ఈనెల 22వ తేదీ శుక్రవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు జాయిన్ఇండియన్ఆర్మీ. ఎన్ఐసీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.