India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు వెలగపూడిలోని వృద్ధురాలి హత్యకేసులో వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ మంగళగిరి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు పోలీసులు శనివారం, ఆదివారం కస్టడీకి తీసుకొని విచారించారు. కాగా ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ పొడిగించింది. దీంతో తిరిగి నందిగం సురేశ్‌ను జిల్లా జైలుకు తరలించారు.

ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులే నేరాలు, ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ పాలనలో వేలమంది చనిపోయినా, ఏ నాడు ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావ్ అని అన్నారు. అనంతబాబు లాంటి వ్యక్తి దళితులని చంపితే, ఇంటికి పిలిపించి భోజనం పెట్టావ్. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్ అని ఆదివారం లోకేశ్ ట్వీట్ చేశారు.

మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి ఒక బిందె పానకం రూ.30 రూపాయలకే భక్తులకు అందిస్తున్నట్లు దేవస్థాన ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు పానకం నివేదన ఉంటుందని చెప్పారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ఇంకా 10 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. జాతీయ కోటాలో మొత్తం 37సీట్లకు 35 భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో విద్యార్థులను కేటాయించారు. అదే విధంగా రాష్ట్ర కోటాలో 213 సీట్లకు 205 పూర్తయ్యాయి. వచ్చే వారం మూడో రౌండ్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

పోలీస్ అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు గుంటూరులో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా శనివారం గుంటూరులో పోలీస్ సిబ్బంది ముందస్తు స్మృతి కవాతు సాధన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ శాంత కుమార్, ఆర్ ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వినుకొండ-గుంటూరు మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణంకు కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేపించుకుంది. ఈ సందర్భంగా పల్నాడులో రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. పేరేచర్ల-కొండమోడు, వినుకొండ-గుంటూరు మధ్య నాలుగు లైన్ల నిర్మాణంను కూటమి ప్రభుత్వం చేపట్టనుంది. దీంతో పల్నాడు ప్రజలందరూ సీఎం చంద్రబాబు, ఎంపీ లావుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉండవల్లిలోని మంత్రి నివాసానికి రావద్దని, మళ్ళీ ప్రజా దర్బార్ జరిగే తేదీని త్వరలో చెప్తామని పేర్కొన్నారు.

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కాచిగూడ-నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు(07791/07792)ను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో రేపల్లె నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు(17646) రేపల్లెలో 75 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.