India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాపట్ల పట్టణంలోని గుంటూరు రహదారిలో గల ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన సదరు వ్యక్తి చంద్రబాబు సభకు వెళుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు.
ప్రజల యాత్రలో భాగంగా ఆదివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల చేరుకున్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తరలివచ్చారు. బాపట్లకు చేరుకున్న ఆయనకు బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు.
తెనాలి మండలం సంగం జాగర్లమూడి సమీపంలో ఆదివారం ఓ మహిళ మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగం జాగర్లమూడి రోడ్డు పక్కన సుమారు 30 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాలిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాడేపల్లి మండలం కుంచనపల్లి అన్నపూర్ణ రెసిడెన్సీ వాసులతో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సమావేశమయ్యారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను పటిష్ఠం చేసి, మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు.
పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులైన ఓటర్లు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఓటు హక్కు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ హెల్ప్ లైన్ డెస్క్, బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ షీట్, సహాయకుడిని అందుబాటులో ఉంచాలన్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ విధానంపై రూపొందించిన సాక్ష్యం యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో రాజకీయ సమీకరణ చేరనున్న ఎమ్మెల్సీలు మారుతున్నాయి. వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు గురజాల నియోజకవర్గంలోని పలువురు నేతలు వైసీపీని వీడి జంగాతో టీడీపీలో చేరనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం జరగనున్న పర్యటనలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం బాపట్ల పట్టణానికి వస్తున్నారు. మార్కాపురం నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల నుంచి సాయంత్రం 5.40 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అంబేడ్కర్ విగ్రహ కూడలిలో రాత్రి 6 గంటలకు ప్రచార సభలో ప్రసంగిస్తారు. రాత్రి బాపట్లలోనే చంద్రబాబు బస చేస్తారు.
ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్శిటీని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. పరిశీలనలో జిల్లా ఎస్పీ తుషార్ దూడీ, మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మందు తాగి వెంకటసాయి (17) మృతి చెందిన ఘటన తుళ్ళూరు (M) మోదుగలంకపాలెంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో మృతుడు ప్రేమలో ఉన్నాడు. విషయం యువతి బంధువులకు తెలియడంతో యువకుడి ఇంటికి వచ్చి బెదిరించారు. భయంతో యువకుడు గురువారం గడ్డి మందు తాగగా, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో రూ. 2,44,000, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సరియైన అర్ధాలు చూపకపోవటంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,29,74,584 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.