Guntur

News March 16, 2024

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: గుంటూరు ఎస్పీ

image

రేపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరగనున్న గ్రూప్-1 అభ్యర్ధుల స్క్రీనింగ్ టెస్ట్‌కు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి శనివారం తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద, ఆర్టీసీ బస్టాండ్, హిందూ కాలేజ్ జంక్షన్ల వద్ద పోలీస్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గమనించాలన్నారు.

News March 16, 2024

గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

రేపు చిలకలూరిపేట సభ జరగనున్న నేపథ్యంలో వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు ఐజి పాలరాజు తెలిపారు. చెన్నై నుంచి కలకత్తా NH-16 పై వెళ్లే వాహనాలు ఒంగోలు -దిగమర్రు NH214-Aపై రేపల్లె, మచిలీపట్నం మీదగా విశాఖపట్నం వెళ్ళాలని, నార్కెట్‌పల్లి NH36 పై హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదగా వెళ్ళాలన్నారు. NH 16పై వెళ్లే వాహనాలు విశాఖపట్నం, హనుమాన్ జం, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్ళాలన్నారు.

News March 16, 2024

బొప్పూడి బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం

image

చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్‌లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.

News March 16, 2024

ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి మనవడు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో ఉన్నారు. మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (టీడీపీ) బరిలో ఉండగా.. తెనాలి నుంచి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (జనసేన)లో పోటీ చేస్తున్నారు. అలాగే గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కాసు మహేష్ రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

News March 16, 2024

YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్

image

కాసేపట్లో YCP MP, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.

News March 16, 2024

మామ, అల్లుడు మధ్య రసవత్తరమైన పోరు

image

పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేయనున్నారు. ఈయన భాష్యం విద్య సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే భాష్యం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ. శంకర్ రావు అన్నయ్య కూతురిని ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. దీంతో ఈసారి మామ, అల్లుడు మధ్య పోరు రసవత్తరంగా మారింది.