India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శనివారం గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 6గంటల వరకు రాష్ట్రంలో అత్యధికంగా మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు స్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు 9701379072, నరసరావుపేట 9701379978, నడికుడి 7989875492, నల్గొండ 9030330121, మిర్యాలగూడ 8501978404, నంద్యాల 7702772080, దొనకొండ 7093745898 తదితర నంబర్లకు ఫోన్ చేసి రైళ్ల రాకపోకల సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ-తెనాలి, తెనాలి-రేపల్లె, గుంటూరు-రేపల్లె, విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-ఒంగోలు తదితర టౌన్‌ల మధ్య రాకపోకలు సాగించే రైళ్లు రద్దయ్యాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

గుంటూరులో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్‌లతో కలిసి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతల గురించి సమీక్ష నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. గంజాయి, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గుంటూరులో ఈవ్ టీజింగ్ మాట ఎక్కడా వినపడకూడదని, యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల నిజాంపట్నం హార్బర్ లో మూడవ నంబర్ ప్రమాదవ సూచిక ఎగురవేసినట్లు ఇన్‌ఛార్జ్ పోర్టు కన్జర్వేటర్ మోకా రామారావు శనివారం తెలిపారు. దీని ప్రభావం వల్ల సముద్రంలో బోట్లు వేటకు వెళ్ళరాదని ఒకవేళ ఎవరైనా వేటకు వెళ్లిన యెడల తీరానికి చేరాలని ఆయన తెలియజేశారు. వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు.

చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వసంతరావు (35) ఉదయం డ్యూటీకి వచ్చి ఆసుపత్రి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి బందువులు మాత్రం ఎవరో చంపి ఉరి వేశారని ఆందోళనకు దిగారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దన్నారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష చేశారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం శనివారం ఉదయం అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పాటుకు అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చేశామని Xలో పోస్ట్ చేశారు.

జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.
Sorry, no posts matched your criteria.