India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం మాచర్లకు వచ్చారు. పలు కేసుల్లో ఆయన నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తిరిగి కారులో హైదరాబాద్ వెళుతూ.. మాచర్లలోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఖజానాకు భారమైనా లబ్ధిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం తెలిపారన్నారు.

గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు వెంటనే నగరంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్ మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం పోలీస్ కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హంగు, ఆర్భాటాలు లేకుండా నరసరావుపేటలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. కేవలం ఐదారు వేల లోపు స్థానిక ప్రజానీకం మధ్య వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో పోలీసు బలగాలను కేటాయించామని.. కానీ భద్రత విషయంలో రాజీ లేదన్నారు.

మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి జరుగుతున్న జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ కొట్టారు.

భారతీయ రిజర్వ్ బ్యాంకు స్థాపించి 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. సంబంధిత పోస్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారు. జిల్లాలోని 8 విశ్వవిద్యాలయాలు, 186 కళాశాలల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులు www.rbi90quiz.in ద్వారా కళాశాల పేరుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) సిటీగా అమరావతి ఉండాలని.. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, CRDA అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగో ఉండాలన్నారు. మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు. ఉదయం 10:10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:45కు నరసరావుపేట కాకాణిలోని JNTUకు చేరుకుంటారు. 12:55 వరకు స్టాల్స్ పరిశీలిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తిరిగి అక్కడ నుంచి బయలుదేరి 1:15గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాను వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మోపిదేవి వెంకట రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాకు గల కారణాలు అన్ని మీడియాకు చెప్పుకోలేనని అన్నారు. రాజ్యసభపై తనకు ఆసక్తి లేదని స్థానిక రాజకీయాల్లోనే ఉండాలనుకున్నానని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.