Guntur

News June 12, 2024

మాచవరం: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

image

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామస్వామి (35) అనే వ్యక్తి పొలంలో పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 12, 2024

ఒకే వాహనంలో ప్రధాని మోదీ, చంద్రబాబు

image

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News June 12, 2024

గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన ఆయనకు గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ముగ్గురూ గన్నవరం ఐటీ పార్కులోని ప్రమాణస్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.

News June 12, 2024

పల్నాడు టీడీపీ నేతలకు నో ఛాన్స్!

image

చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో 24 మందితో మంత్రివర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఇందులో పల్నాడులోని ఒక్క నాయకుడికి చోటు దక్కలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణలకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఎదురు చూశారు.

News June 12, 2024

రజనీకాంత్‌తో ముచ్చటించిన ఎంపీ బాలశౌరి

image

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రజనీని.. పాత పరిచయంతో కలిసి ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తున్న ఆయనతో మాట్లాడుతూ.. ‘సార్.. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు.. మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు’ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఇరువురూ ఒకే ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వచ్చారు.

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై 36 మంది

image

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి, కె.రామ్మోహన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై.. చిరంజీవి, రజినీకాంత్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఆశీనులు కానున్నారు.

News June 12, 2024

గుంటూరు జిల్లా నుంచి మంత్రులు వీరే..

image

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. నారా లోకేశ్(మంగళగిరి), నాదెండ్ల మనోహర్ (తెనాలి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)కు చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా.. లోకేశ్ గత TDP ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

News June 11, 2024

గుంటూరు: చంద్రబాబు నివాసానికి చేరుకున్న అమిత్ షా

image

తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ చంద్రబాబు అమిత్‌షాకి విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే అమిత్‌షా రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ నోవాటేల్‌లో అమిత్‌షా బసచేయనున్నారు. 

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.