India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.
ఈనెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్నందున, గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ మంగళవారం తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్ వెళ్లాలన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందన్నారు.
ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్ వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24) ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్ వెళ్లాడు. అయితే ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం మాంచెస్టర్ నుంచి పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.
గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగించారు. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా.. విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కరుణ సోమవారం తెలిపారు. ఈనెల 14 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.
విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.
గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో శాఖ కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా ఆయన్ను నియమించారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ దిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీగా 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు బోద్దులూరి రంగారావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తనకు పదవి ఇచ్చారని, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పత్రాన్ని జిల్లా అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.