India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నరసరావుపేట శంకరభారతీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో జట్ల ఎంపికలు సెప్టెంబర్ 1న జరుగుతాయని ఆ సంఘం కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. ఆసక్తి గలవారు 01.10.2010 తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. వయసు, ఎత్తు, బరువు కలిపి 215 పాయింట్లు మించి ఉండరాదన్నారు. ఒక పాఠశాల నుంచి ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎంపికలకు హాజరు కావాలన్నారు.

ఈ నెల 28వ తేదీ నుంచి మాల్తా దేశంలో జరిగే వరల్డ్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారతదేశ జట్టులో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా పవర్ లిఫ్ట్‌ర్లు ఎంపికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కరరావు శుక్రవారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తెనాలి పట్టణానికి చెందిన షానూన్, మంగళగిరి పట్టణానికి చెందిన సాదియా అల్మాస్ పోటీ పడనున్నారు.

జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలను నివారించేందుకు యాజమాన్యాలు అవసరమైన అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో పరిశ్రమలలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో రక్షణ ఏర్పాట్లను ఫ్యాక్టరీస్, కార్మిక, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలు తనిఖీలు నిర్వహించి నివేదిక అందించాలన్నారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆయన రిలీజ్‌కు బ్రేక్ పడింది. కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌కు చేరడానికి ఇవాళ సమయం మించి పోవడంతో నిబంధనలు మేరకు మాజీ ఎమ్మెల్యేను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్‌దే అని మంత్రి సవిత అన్నారు. శుక్రవారం అమరావతిలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారని విమర్శించారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియాలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇకనైనా జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని సవిత హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం నగరం మండలం దూళిపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంపై ప్రజలలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం గ్రామంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో జరిగిన దాడుల కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా శుక్రవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. గురువారం ఇరువర్గాల వాదన ముగిసింది. ఇప్పటికే జిల్లా కోర్టులో రెండు సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే.

నకరికల్లులో 26న అండర్-18 ఆట్యా పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు శంకరభారతీపురం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు 1-01-2007 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వయసు, ఎత్తు కలిపి బాలురు 250 నుంచి 260 వరకు, బాలికలైతే 230 నుంచి 240 వరకు ఇండెక్స్ కలిగి ఉండాలన్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలను చిలకలూరిపేటలోని సీఆర్ క్లబ్ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ తెలిపారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. పోటీలకు జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు, రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు పలువురు క్రీడాకారులు మొత్తం 160 మంది వరకు తలపడనున్నారని వివరించారు.

రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు మాత్రమే ఇసుక రవాణా చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక బుకింగ్ చేయడం లేదని, తుళ్లూరు, తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయాల్లో, గుంటూరు ఆర్‌డీఒ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్ర 5 గంటల వరకు బుకింగ్ చేసుకోవాలని అన్నారు. తాళ్లాయపాలెం, లింగాయపాలెం స్టాక్ పాయింట్లలో 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.