India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-ఔరంగాబాద్- గుంటూరు మధ్య రైలును ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభించాలని ద.మ. రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఔరంగాబాద్ 13.20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17254) ఔరంగాబాద్‌లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటి రోజు 21.30 గంటలకు చేరుతుంది.
సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.
మండలంలోని చిలువూరుకి చెందిన టీడీపీ కార్యకర్త ఖాసిం(24) హత్య కేసులో నిందితులుగా ఉన్న తుమ్మపూడికి చెందిన నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్‌ఐ బి.మహేంద్ర తెలిపారు. హర్షవర్ధన్, హృదయరాజు, కమల తేజ, రవీంద్రబాబులకు తెనాలి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. టీడీపీ గెలిచిందని సంతోషంలో ఉన్న ఖాసిం తలపై 4న బ్యాట్‌తో దాడి చేయగా, శుక్రవారం మరణించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ తుషార్ శుక్రవారం ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతE చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ జైత్రయాత్రలో భాగస్వామి అయినందుకు యువ సినీ హీరో, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అల్లుడు సిద్ధార్థ్ నిఖిల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. శుక్రవారం మాలకొండయ్యతో కలిసి నిఖిల్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో లోకేశ్ సరదాగా ముచ్చటించారు. సినిమాల్లో హీరో మాదిరే రియల్‌గా ప్రజలకు మేలు చేయాలన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. శుక్రవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే, మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తనని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఫోటో దిగారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్, హీరో నిఖిల్ పాల్గొన్నారు.
తాడేపల్లి పరిధి బ్రహ్మానందపురం వద్ద ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులు సభా స్థలాన్ని పరిశీలించారు. 80 కంటే ఎక్కువ వాహనాలలో సభా ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రి చేరుకుంది. సుమారు 200 ఎకరాల ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీఏ కూటమి ప్రముఖులు హాజరుకానున్నారు.
నరసరావుపేట టీడీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాయలు దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో తాజా ఎన్నికల్లో టీడీపీ ఎంపీలుగా గెలిచిన వారందరూ ఉన్నారు. ప్రధానితో ఎన్డీఏ భాగస్వాముల భేటీలో పాల్గొనేందుకు ఎంపీలంతా చంద్రబాబుతో కలిసి దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.
పట్టణంలోని ఓ ఇంట్లో కుళ్లిన మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. నగరంపాలెం స్టాల్ హై స్కూల్ ఎదురుగా ఓ ఇంటిలో నుంచి దుర్వాసన రాగా స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడు రాంబాబుగా గుర్తించామన్నారు. అనారోగ్య కారణాలతో చాలా రోజుల కిందట చనిపోయినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.