India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండల పరిధిలోని చింతలచెరువు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
బాపట్ల జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ రకుల్ జిందాల్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఇరువురు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన అధికారులకు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నిధులు చెల్లించడం జరిగిందన్నారు.
అదృష్టం ఉంటే తనకు మంత్రిత్వ శాఖ దక్కుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం, జగన్ పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు.
సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులకు తొలుత ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా అచ్చెన్నాయుడు కలిశారు. గురువారం తాడేపల్లి (M) ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవటం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.
తాజా ఎన్నికల్లో గెలిచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడుతున్న చంద్రబాబుకు పోలీసులు భద్రతను పెంచారు. తాడేపల్లి (M) ఉండవల్లి గ్రామంలోని ఆయన నివాసం వద్ద ఇద్దరు గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG ఇచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేస్తూ భద్రతను మరింత పెంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7 తరగతుల రాష్ట్ర సిలబస్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిజాంపట్నం గురుకులపాఠశాల కన్వీనర్ వై. నాగమల్లేశ్వరరావు బుధవారం తెలిపారు. నక్షత్రనగర్, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, వినుకొండ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.
గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి, యరపతినేని, జూలకంటి, గల్లా మాధవి, అనగాని, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వైసీపీ హయంలో అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.
గుంటూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ(3,44,695)తో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంపెనీలు అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న పెమ్మసాని కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి ఉపయోగం అని వారు అంటున్నారు. దీంతో పెమ్మసాని పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.