India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లా ఎన్నికల విధుల్లో అందరి కృషి అభినందనీయమని ఎస్పీ తుషార్ తెలిపారు. బుధవారం ఆయన గుంటూరులోని కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి, పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, కేంద్ర బలగాలకు, ఇతర శాఖల అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్ రావుపై ఆయన అల్లుడు భాష్యం ప్రవీణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. శంకర్ రావు అన్నయ్య కూతురిని భాష్యం ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ అవుతారు. కాగా మామ నంబూరు శంకర్ రావుపై 21,089 ఓట్ల మెజారిటీతో భాష్యం ప్రవీణ్ విజయం సాధించి సత్తా చాటాడు.
మాచవరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మాచవరం ఎస్సై అమిరుద్దీన్ బుధవారం తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. మండలంలోని పిన్నెల్లి, కొత్త గణేషన్‌పాడు గ్రామాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు.
నరసరావుపేట లోక్ సభ ఎన్నికలలో ఈసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేయలేదు. 1999, 2004లో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి ఎంపీలుగా గెలిచారు. అదే సెంటిమెంట్‌తో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దించింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణ దేవరాయలు ఈ దఫా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.
గుంటూరు ఎంపీ స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై 4,205 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు. అయితే 2024లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని.. రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పెమ్మసానికి 60.68 శాతంతో భారీ మెజారిటీ సాధించారు.
నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ మధ్య 10 శాతం ఓట్ల తేడా కనిపించింది. కాగా శ్రీకృష్ణదేవరాయలు 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటిపై కూడా 10 శాతం అదనంగా ఓట్లు పొంది గెలుపొందారు. గతంలో మెజారిటీ 1,35,220 కాగా ఈసారి మరింత పుంజుకుని 1,59,729కి పెరిగింది.
చిలకలూరిపేటకు చెందిన సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్‌తో ఏపీలోని వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. నిన్నటి ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క చోటా YCP ఖాతా తెరవలేకపోయింది. 17 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. మంగళగిరి, తదితర చోట్ల టీడీపీ గెలుస్తుందనే ఆరా మస్తాన్ అంచనా నిజం కాగా, చాలా చోట్ల ప్రతికూల ఫలితం వచ్చింది.
మాచర్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జూలకంటి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి, తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1972 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పులి గుర్తుపై పోటీ చేసి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి ఆయనను పల్నాటి పులి అని పిలుస్తారు. 1999 ఎన్నికలలో నాగిరెడ్డి సతీమణి దుర్గాంబ టీడీపీ నుంచి గెలుపొందారు. తాజాగా బ్రహ్మారెడ్డి విజయం సాధించారు.
పెదకూరపాడులో టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన తన మామ, సమీప ప్రత్యర్థి నంబూరు శంకర్రావుపై గెలిచారు. కాగా, మార్చి 15న నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 60 రోజుల్లోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. సీనియర్ నేత, టికెట్ ఆశించి భంగపడిన కొమ్మాలపాటి శ్రీధర్ సహకారం ఈయనకు కలిసొచ్చింది. పల్నాడులో తొలిసారి గెలిచిన వారిలో భాష్యం ప్రవీణ్ ఒకరు.
బాపట్ల ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్ పై, తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
Sorry, no posts matched your criteria.