Guntur

News July 5, 2024

గుంటూరు: ఆన్లైన్ మోసం.. రూ.10లక్షలు స్వాహా

image

ఆన్లైన్ మోసంపై అరండల్‌ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరిటెపా డుకు చెందిన హేమంత్ కుమార్ టెలిగ్రామ్ యాప్లో ఓ టాస్క్ ఆపరేట్ చేశాడు. అందులో టాస్క్ పెట్టి పూర్తి చేస్తే డబ్బులు ఇస్తామని చెబుతారు. టాస్క్ నిర్వాహకులు చెప్పిన విధంగా పలుమార్లుగా రూ.10లక్షలు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 4, 2024

జగన్ నువ్వు మంచి చేయలేదు.. ముంచేశావ్: నారా లోకేశ్

image

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ‘జగన్ నువ్వు మంచి చెయ్యలేదు.. ముంచేశావ్’ అని ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం పరామర్శించిన జగన్.. మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల్లో మంచి చేసి ఓడిపోయామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ తాజాగా స్పందించారు.

News July 4, 2024

దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ పూజలు

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.

News July 4, 2024

ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌ అవ‌కాశాలు: మంత్రి స‌త్య‌కుమార్

image

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చెప్పారు. గురువారం అబుదాబికి చెందిన ఎంఎఫ్‌2 సంస్థ ప్ర‌తినిధులతో మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ప్ర‌తినిధులు ఒప్పందాలు చేసుకుంటామని చెప్పినట్లు మంత్రి తెలిపారు.

News July 4, 2024

వెల్దుర్తి: టీడీపీ కార్యకర్త దారుణ హత్య

image

వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీద‌పల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హనిమిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందినక కార్యకర్త గురువారం గ్రామ శివారులో చనిపోయి ఉండటం గమనించిన గ్రామస్థులు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హనిమిరెడ్డి మెడపై కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

News July 4, 2024

అల్లూరి సీతారామరాజుకు పల్నాడు ఎస్పీ నివాళులు

image

పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో జిల్లా మలికా గర్గ్ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్ర, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News July 4, 2024

దాచేపల్లి వద్ద స్కూల్ ప్రిన్సిపల్ మృతదేహం కలకలం

image

దాచేపల్లి పిడుగురాళ్ల హైవేపై వాసవి గ్రీన్ సిటీ‌లో స్థానిక ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ నాగిరెడ్డి మృతదేహంగా కనిపించడం గురువారం కలకలం రేపింది. ఈనెల ఒకటో తారీకు నుంచి నాగిరెడ్డి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు నాగిరెడ్డిగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

News July 4, 2024

బాపట్ల: విధి నిర్వహణలో సైనికుడు గుండెపోటుతో మృతి

image

బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందినట్లు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో వీధి నిర్వహణలో ఉన్న రజ్జుబాషా అకాల మరణం బాధాకరమన్నారు. నేటి సాయంత్రానికి ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంటుందని తెలిపారు. వారి కుటుంబానికి మాజీ సైనిక సంక్షేమ సంఘం అండగా ఉంటుందన్నారు.

News July 4, 2024

గుంటూరు: YCP నాయకుల గుండెల్లో రైళ్లు?

image

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

News July 4, 2024

గుంటూరు: నేడు విద్యాసంస్థల బంద్‌కు SFI పిలుపు

image

గుంటూరు నగరంలోని విద్యాసంస్థలను గురువారం మూసివేయాలని బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌లో భాగంగా.. ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోరుతూ.. ఈ బంద్‌ చేపట్టినట్లు SFI నాయకులు తెలిపారు.