Guntur

News August 18, 2024

‘నేరాల కట్టడికి ముందస్తు సమాచారం కీలకం’

image

నేరాల కట్టడికి ముందస్తు సమాచారం సేకరించడం కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆదివారం ఆయన బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖకు ఎస్‌బీ విభాగం కళ్ల, చెవులు వంటిదన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌ఛార్జ్ సీఐ బాల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

News August 18, 2024

గుంటూరులో 198 బైకులు సీజ్

image

గుంటూరు పట్టణంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలలో సరైన పత్రాలు లేని 198 బైకులను సీజ్ చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 198 వాహనాలకు ఆర్టీఐ అధికారులు చలానాలు విధించినట్లు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని నల్లపాడు సీఐ అన్నారు. ప్రతి వారం కార్యక్రమం చేపడతామన్నారు.

News August 18, 2024

గుంటూరు శాస్త్రవేత్తకు నాసా అవార్డు

image

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త శింగం శ్రీకాంత పాణికి దక్కింది. పరిశోధనల్లో ఆయన చూపిన సృజనాత్మకతకు నాసా ఈ అవార్డు అందించింది. ఈ మేరకు అమెరికాలోని ఆలబాలోని హంట్స్ విల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

News August 18, 2024

బాపట్ల: ప్రేమ పేరుతో మోసం చేసిన బాలుడు

image

మైనర్ల ప్రేమ విషయమై ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి కథనం మేరకు.. రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. ఓ బాలుడు 6వ తరగతి వరకు చదివి అలంకరణ పనులు చేస్తున్నాడు. ప్రేమ పేరుతో గత 8 నెలలుగా వీళ్లు చనువుగా ఉంటున్నారు. గమనించిన బాలిక తల్లి బాలుడు మోసం చేశాడని బాపట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అహమ్మద్ జానీ తెలిపారు.

News August 18, 2024

రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలి: సీఎం

image

రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని సీఎం చంద్రబాబుతో కలిసి నరసరావుపేట ఎంపీ లావు ప్రదానిని కోరారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. పోలవరం, రాజధాని, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

News August 17, 2024

బాపట్లలో బాలికపై అత్యాచారం

image

బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేశారని శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఇద్దరు మైనర్ల మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడిచింది. ఈ నేపథ్యంలో బాలిక 5 నెలల గర్భవతి అవ్వటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News August 17, 2024

GNT: 19 వరకు దరఖాస్తులకు గడువు

image

గుంటూరు మెడికల్ కాలేజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు, 19న కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఏపీ పారామెడికల్ బోర్డు ఆదేశాల మేరకు ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 27వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేవారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.

News August 17, 2024

గుంటూరు జిల్లాలో అన్న క్యాంటీన్లపై మీ కామెంట్..!

image

గుంటూరు జిల్లాలో తొలి విడతలో భాగంగా 13 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరులో 7, మంగళగిరిలో 3, తెనాలిలో 3 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

News August 17, 2024

గుంటూరు: ఇలా అసలు చేయకండి..!

image

వాహనాలు నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని అధికారులు తరచూ సూచిస్తుంటారు. దానిని పట్టించుకోకపోవడంతో వచ్చిన అనర్థమే ఇది. గుంటూరు నగర శివారు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఓ వ్యక్తి బైకుపై వేగంగా నల్లపాడు వైపు వస్తున్నాడు. అదే సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్‌కి తరలించారు.

News August 17, 2024

ఏపీలో మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్: చంద్రబాబు

image

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆర్థికాభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులకనుగుణంగా ప్రభుత్వం, సీఐఐ ఇండస్ట్రీ ఫోరమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు.
సీఐఐ మోడల్ కెరీర్ సెంటర్ ద్వారా యువతలో ఉపాధిని పెంపొందించడంపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు.