India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాజకీయ పార్టీల కార్యక్రమంలో పాల్గొనే వాలంటీర్లను తొలగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులతో పాటు గౌరవ వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని చెప్పారు.
ఎన్నికల కమిషన్ తెచ్చిన యాప్‌లలో ముఖ్యమైన సీ విజిల్ యాప్‌ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. సీ విజిల్ యాప్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. మద్యం, నగదు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు, వీడియోలు ఈ యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. యాప్‌లో పెట్టిన ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కారం చేయడం జరుగుతుందని చెప్పారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. 127 కేంద్రాల్లో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 25,423 మందికి 24,931 మంది హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 60 కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. తాను వినుకొండలో మూడు కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
పదో తరగతి ఆంగ్ల పరీక్షకు జిల్లాలో 108 కేంద్రాల్లో 16,952 మంది హాజరు కావాల్సి ఉంది. అందులో 16,424 హాజరు కాగా 528 మంది గైరాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకి, చీరాలలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 28కేంద్రాల్లో విద్యార్థులను తనిఖీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు.
రైలు కిందపడి మహిళ మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం మాచర్ల ప్యాసింజర్ రైలు వస్తున్న సమయంలో గుర్తుతెలియని మహిళ రైలు కిందపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ, వైసీపీ శ్రేణులపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నరేష్ వివరాలు మేరకు.. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ ఇంటి వద్ద వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘటనలపై 2 పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎవరైనా దాడులకు పాల్పడినా, భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినట్టు సమాచారం ఉంటే ప్రత్యక్షంగా చర్యలు పాల్పడొద్దన్నారు. సిటిజన్ యాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్లు లేదా దగ్గర్లోని పోలీసులు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేకానీ ఎవరికి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కర్లపూడి గ్రామానికి చెందిన అభిషేక్ (17) పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్నానానికి వైకుంఠపురం పుష్కరఘాట్‌కు వచ్చి నీట మునిగి చనిపోయాడు.
వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.